ఫ్యాక్ట్ చెక్: తైవాన్ న్యూ ఇయర్ వేడుకులు అవి.. టోక్యో ఒలింపిక్స్ లోవి కాదు..!

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువై పోయాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో టోక్యో ఒలింపిక్స్ 2020 ఓపెనింగ్ సెర్మనీ కి సంబంధించినవి అని వార్తలు కూడా వినపడ్డాయి.

అయితే దీనిలో నిజం ఎంత ఉంది అనే విషయాన్ని మనం చూస్తే… తాజాగా సోషల్ మీడియాలో టోక్యో ఒలింపిక్స్ 2020 ఇనాగరేషన్ సెర్మని అని హల్చల్ అవుతున్న వీడియో లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

దీపావళి మాదిరి జిగేల్మంటున్న లైట్లు ఈ వీడియోలో మనం చూడొచ్చు. అయితే టోక్యో ఒలింపిక్స్ కి దీనికి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పటిది అనేది చూస్తే… తైవాన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 31, 2020 నాటిదని స్పష్టంగా తెలుస్తోంది.

కనుక ఇవి టోక్యో ఒలింపిక్స్ 2020 లోనిది కాదని.. ఒలింపిక్స్ కి దీనికి సంబంధం లేదు అని తైవాన్ వార్తల్లో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.

ఐదు నిమిషాల పాటు ఫైర్ వర్క్స్ తో వున్న వీడియో లో చూసినవి తైవాన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నాటిది అని ఇది టోక్యో ఒలింపిక్స్ లోనిది కాదని చెప్పారు. అలానే టోక్యో ఒలంపిక్స్ వేదిక మరియు ఈ వేదిక రెండూ వేరువేరుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news