భారత ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశవ్యాప్తంగా వందే భారత్ రైల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా తెలుగు రాష్ట్రాల్లోకి రెండు రైళ్లను ప్రారంభించారు ప్రధాని మోడీ. వందే భారత్ రైళ్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అవి వేగంగా వెళ్తున్నాయని కొందరూ ట్వీట్ చేస్తే.. దానికి డబ్బులు బొక్క అని మరికొందరూ ఇలా రకరకాలుగా పోస్టులు పెట్టినప్పటికీ వందే భారత్ రైళ్ల వల్ల చాలా మందికి ప్రయాణం సులభతరం అవుతుందనే చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే.. వందే భారత్ స్లీపర్ రైళ్ల ఒప్పందంలో 50 శాతం ఖర్చు పెరిగిందని ఓ ట్వీట్ తప్పు దారి పట్టించిందనే చెప్పాలి. వాస్తవానికి రైళ్ల సంఖ్య 200 నుంచి 133 కి తగ్గినప్పటికీ ఖర్చు 50 శాతం ఎలా పెరుగుతుంది..? సోషల్ మీడియాలో ఖర్చు రూ.436 కోట్లు అయిందనే వార్త వాస్తవం కాదు. దాదాపు మొత్తం కోచ్ ల సంఖ్య అలాగే ఉంటుంది. కోచ్ ల సంఖ్యతో గుణిస్తే.. ఒక్కో కోచ్ ధర రైలు ధరకు సమానం. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉన్నందున ఒక్క కోచ్ ధర అన్ని బెంచ్ మార్కుల కంటే తక్కువగానే ఉంది. ఎకానమీ మొత్తం కాంట్రాక్ట్ విలువను తగ్గించింది.. పెంచలేదు అని స్పష్టమవుతోంది.
A tweet misleadingly claims that the 50% cost increase in the Vande Bharat Sleeper trains contract even though the number of trains has reduced from 200 to 133#PIBFactCheck
⚠️ There’s no 50% price hike!
▫️The no of coaches per train increased from 16 to 24 to meet high demand pic.twitter.com/ElBYzsKCba
— PIB Fact Check (@PIBFactCheck) September 16, 2024