ముక్కు నుంచి రక్తస్రావం అవుతోందా.. ఈ చిట్కాలతో ఆపేద్దాం..!

-

సమ్మర్ లో తరుచుగా కొందరికి ముక్కు నుంచి రక్తం వస్తుంది. కొన్నిసార్లు.. ఇది ఎక్కువగా కూడా అవుతుంది. ముక్కు నుంచి రక్తస్రావం అవడం అనేది.. ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ మనిషి ముందు కాస్త భయాందోళనకు గురవుతాడు. దీని కారణంగా.. లేనిపోని సమస్యలు. వేడికారణంగా ఇది జరుగుతుంది. ఈరోజు మనం ముక్కు నుంచి రక్తస్రావం అ‌వడానికి కారణాలు, నివరాణ మార్గాలు చూద్దాం.

ముక్కు నుంచి రక్తస్రావానికి ప్రధాన కారణాలు..

ప్రధానంగా వేడి వల్ల ఇలా జరుగుతుంది.
అలర్జీలు, ఏదైనా అంతర్గత నరాలు లేదా రక్తనాళాలు దెబ్బతినడం
శరీరంలో పోషకాల కొరత, సైనస్, మలేరియా, టైఫాయిడ్, విపరీతమైన తుమ్ములు, ముక్కును ఎక్కువగా రుద్దడం లాంటి అనేక కారణాల వల్ల ముక్కు నుంచి రక్తం కారుతుంది.

నిరోధించడానికి మార్గాలు..

ఒక వ్యక్తి ముక్కు నుండి రక్తస్రావం మొదలైన వెంటనే, అతనిని నేలపై పడుకోబెట్టండి. తద్వారా రక్తం రావడం ఆగిపోతుంది. దీని వల్ల తలతిరగడం, భయం మొదలైనవి కూడా తొలగిపోతాయి.

ఐస్ క్యూబ్స్‌ను ముక్కుపై 2-3 నిమిషాలు ఉంచినా. ఉపశమనం ఉంటుంది. ఐస్ చల్లదనం రక్తం గడ్డకట్టడానికి ,రక్తస్రావం ఆపడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది.

ఎసెన్షియల్ నూనెతో కూడా రక్తస్రావాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేయాలి. పేపర్ టవల్ నీటిలో ముంచి, దానిని బయటకు తీసి నీటిని పిండి… ముక్కు మీద ఉంచండి. రెండు నిమిషాలు తేలికగా నొక్కండి. ఈ నీటిలో కొన్ని చుక్కలను ముక్కులో కూడా వేసుకోవచ్చు.. లావెండర్ ఆయిల్ దెబ్బతిన్న నాసికా రక్తనాళాలను నయం చేస్తుంది.

ఉల్లిపాయ రసం కూడా ముక్కు నుండి రక్తస్రావం సమస్యను నివారిస్తుంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజమే.. ఉల్లిపాయను మిక్సీలో గ్రైండ్ చేసి ,దాని రసాన్ని పిండండి. అందులో కాటన్ బాల్‌ను ముంచి, ముక్కుపై 1-2 నిమిషాలు ఉంచండి. ఉల్లిపాయ ముక్కను ముక్కు దగ్గరికి తీసుకుని దాని వాసన పీల్చుకోవడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. నిజానికి, ఉల్లిపాయల వాసన రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది, ఇది రక్తస్రావాన్ని ఆపుతుంది.

విటమిన్ ఇ క్యాప్సూల్‌లో ఉన్న ఆయిల్‌ని ముక్కు లోపల కాటన్ సహాయంతో అప్లై చేసి కాసేపు బెడ్‌పై పడుకోండి.. ముక్కు పొడిగా అనిపించినప్పుడల్లా ఈ నూనెను ఉపయోగించుకోవచ్చు.. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. ముక్కు పొరలు తేమగా ఉంటాయి.

అయితే అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే.. ఇలాంటి చిట్కాలను పాటించి ఉపశమనం పొందవచ్చు. కానీ తరచూ ముక్కు నుంచి రక్తస్రావం అవడం అనేది మంచి విషయం కాదు.. ఓసారి డాక్టర్ ను సంప్రదించి.. కారణాలు ఏంటో తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version