బిజినెస్ ఐడియా: కందగడ్డ సాగుతో లాభాలే లాభాలు..!

-

ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. వ్యాపారాల ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు చాలా మంది. అయితే ఈ రోజుల్లో ఉద్యోగాన్ని వదిలేసి మరీ వ్యాపారం మొదలు పెడుతున్నారు. అలాగే వ్యవసాయ పద్ధతులు కూడా ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారా..? అయితే ఏ వ్యాపారం చేయాలో తెలియడం లేదా..? మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా.

ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. ప్రస్తుతం వ్యవసాయం లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. లాభాలు కూడా బాగా తగ్గిపోయాయి. పంటలు వేయడం ఆ తర్వాత తెగుళ్లు వంటివి సంభవించడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నష్టమే చాలా మంది రైతులకి కలుగుతోంది. అయితే నష్టాలు కలగకుండా ఉండాలంటే కందగడ్డ సాగు చేస్తే మంచిది.

పైగా ప్రకృతి వైపరీత్యాల కి ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన పనే లేదు. అధిక లాభాలుని కందగడ్డ తీసుకు వస్తుంది. అయితే ఇది భూములు లో పడుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇక ఇది ఇలా ఉంటే ఈ పంట పండించేటప్పుడు నీరు పెట్టడం, ఎరువులు వేయడం లాంటివి సరిగ్గా జరిగేటట్లు చూసుకోవాలి. వర్షధార పంట గానే దీనిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. నీటి సౌకర్యం ఉంటే వారానికి ఒకటి నుండి రెండు సార్లు నీటిని పెట్టొచ్చు.

ఎక్కువగా ఎరువులు కూడా అవసరం లేదు. సేంద్రియ ఎరువులతోనే కందగడ్డ అధిక దిగుబడి ఇస్తుంది. ఆవు పేడని కూడా ఈ పంటని పండించేటప్పుడు ఎరువుగా వాడొచ్చు. గజేంద్ర, శ్రీ పద్మావతి రకాలను ఎంచుకుని పండిస్తే మంచిగా లాభాలు వస్తాయి. పైగా రిస్క్ ఉండదు. పెట్టుబడి ఖర్చు కూడా తక్కువే. ఇలా కందగడ్డ సాగు చేసి మంచిగా లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version