ఆలూ చిప్స్ తో షుగర్, గుండెనొప్పులు, బీపీ రావటం పక్కా..!

-

దుంపల్లో అసలు బాగా తినకూడని దుంప ఏదైనా ఉంది అంటే.. అది బంగాళదుంపే.. కానీ మనం మాత్రం వారానికి రెండుసార్లు అయినా వండుకుంటాం. బరువు తగ్గాలనుకునేవారు బంగాళదుంపకు దూరంగా ఉంటారు. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా.. కానీ సన్నగా ఉన్నవాళ్లు.. బంగాళదుంపను తినడానికి అసలు వెనకాడరు. ఇంకా ఆలూచిప్స్ అయితే డైలీ తింటారు కొందరు. లంచ్ లో సైడ్ డిష్ లా వీటిని ఎప్పుడూ తెచ్చి రెడీగా పెట్టుకుంటారు.

ఆలూచిప్స్ ను ఇష్టపడనివారంటూ ఎ‌వరూ ఉండరేమో కదా.. మంచి క్రిస్పీక్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. ఆఖరికి.. బరువు తగ్గాలనుకునేవారు కూడా.. అప్పుడప్పుడు నాలుగు చిప్సేగా అని తినేస్తుంటారు. కానీ బంగాళదుంపల చిప్స్ తో పెద్ద ప్రమాదమే ఉందని మీకు తెలుసా.. మీరు అనుకున్నట్లు.. బరువు ఒక్కటే కాదండి.. పెద్ద స్కెచ్చే వేసింది ఆలూచిప్స్..! మరీ ఆలూచిప్స్ తినటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో నిపుణులు ఏం అంటున్నారో చూద్దామా..

బీపీ..

వేఫర్స్, చిప్స్ నిండా ఉప్పు, నూనె ఉంటాయి. ఇవి ఉండడం వల్లే అవి అంత కరకరలాడుతూ రుచిగా అనిపిస్తాయి. అయితే, ఇవే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్‌ని కూడా పెంచేస్తాయి. బీపీ పెరిగిందంటే స్ట్రోక్, కార్డియాక్ డిసీజెస్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. ఈ చిప్స్ ఎక్కువ తింటే బీపీ పెరిగి హైపర్ టెన్షన్‌కి దారి తీస్తుంది. అలాగే, లాంగ్ రన్‌లో ఇది బ్రెయిన్ హెల్త్‌ని సైతం దెబ్బ తీసి డిమెన్షియాకి కారణం కావచ్చు. ఎందుకంటే చిప్స్, వేఫర్స్ లో ఉండే ఉప్పు బాడీలో ఉండే సోడియం లెవెల్స్ ని డీస్టెబిలైజ్ చేస్తుంది.

కాన్సర్ రిస్క్..

వేఫర్స్ ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ లో యాక్రిలమైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది, ఈ కెమికల్‌కి కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ కెమికల్ బాడిలో క్యాన్సర్ పెరగడానికి దోహదం చేస్తుంది. పొటాటో చిప్స్ లో కూడా ఈ క్యాన్సర్ కారకం ఉంటుంది. అంటే ఇవి ఎక్కువగా తింటే క్యాన్సర్ ముప్పు పెరిగినట్లే అని.. అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ వారి రిపోర్ట్ లో పేర్కొన్నారు.

మెంటల్ హెల్త్..

ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్న కొద్దీ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుందట. కాబట్టి హ్యాపీగా అనిపించడం కోసం తినే చిప్స్ వల్ల మీ మెంటల్ హెల్త్ స్పాయిల్ అయ్యే రిస్క్ ఉంది.

గుండెకి మంచిది కాదు..

చిప్స్, వేఫర్స్ లో ఉండే ఉప్పు, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, కార్సినోజెనిక్ యాక్రిలమైడ్ వంటి కెమికల్స్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ వచ్చే రిస్క్‌ని పెంచుతాయి. 2009లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ద్వారా ప్రచురించబడ్డ ఒక పరిశోధన ప్రకారం.. యాక్రిలమైడ్స్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కార్డియాక్ డిసీజెస్, స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుందని తేలింది.

సంతానోత్పత్తి సామర్ధ్యం కూడా..

ఇది ఇంకా పెద్ద రిస్క్.. చిప్స్ వల్ల సంతానోత్పత్తి సామర్ధ్యం కూడా తగ్గుతుందట. రీప్రొడక్టివ్ హెల్త్ మీద సాల్ట్, ఫ్యాట్స్ బాగా ప్రభావితం చేస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ మహిళల్లో ఇన్‌ఫెర్టిలిటీ రిస్క్‌ని పెంచుతుందని హార్వార్డ్ మెడికల్ స్కూల్ వారి కథనంలో వెల్లడైంది.

వెయిట్ గెయిన్..

పకోడీలో, గారెలో అయితే ఆయిల్ ఎక్కువ ఉంటుందని కంటికి కనిపిస్తుంది కాబట్టి.. వాటిని తినడానికి ఆలోచిస్తారు.. కానీ.. చిప్స్ లో మనకు ఆయిల్ కనిపించదుగా.. ఈ చిప్స్‌లో కూడా అలాగే ఆయిల్, సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఎడిటివ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎంప్టీ క్యాలరీలే, వీటి వల్ల బరువు కచ్చితంగా పెరుగుతారు..

ప్యాకెట్ చిప్స్ మీ పాకెట్ కాళీ చేయించేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదండి.. ఇన్నీ రోగాలకు ఇలాంటి చిప్స్ కారణమని తెలిసి కూడా ఇంకా తినడం ఎందుకు చెప్పండి.! టైం పాస్ కి కూడా ఇలాంటివి తినొద్దంటున్నారు నిపుణులు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version