నేటి కాలంలో యువకులు మరీ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తీరును ప్రతి రోజూ సోషల్ మీడియా పుణ్యమాని ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా బైక్ రేస్ లు చాలా ఎక్కువ అయ్యాయి.. కొన్ని మాత్రమే పందెం కోసం జాలుగుతూ ఉంటే.. మరికొన్ని అమ్మాయిల ప్రేమ కోసం , వారి ముందు బడాయి చూపించడానికి ఇలా చాల కారణాలుగా బైక్ ల మీద చట్ట వ్యతిరేకమైన స్పీడ్ లో డ్రైవింగ్ చేస్తూ ప్రత్యక్షముగా పరోక్షముగా ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. ఇక చాలా సందర్భాల్లో కొత్త కొత్తగా చేసే బైక్ స్టంట్ ల వలన వారి ప్రాణాలకే ముప్పు జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులుగా అలాంటి ఒక బైక్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అసలు విషయానికి వెళ్తే ఈ వీడియో లో ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిలను ముందు ఒకరు వెనుక మరొకరిని కూర్చుని పెట్టుకుని ఫ్రంట్ వీల్ ను ఫుల్ గా పైకి లిఫ్ట్ చేసి దాదాపుగా 100 kmph పైగా స్పీడ్ తో ముంబై రోడ్ లలో డ్రైవ్ చేస్తూ వెళుతాడు. పైగా ఈ వీడియోను సోషల్ మీడియాలో సదరు యువకుడు పోస్ట్ చేయడంతో వైరల్ అయితే అయింది. కానీ ఈ వీడియోను చూసిన ముంబై సిటీ పోలీసులు వెంటనే కేసును నమోదు చేసి ఆ యువకుడు మరియు ఆ ఇద్దరు అమ్మాయిలపై ముంబై BKC పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 308 కింద హత్యాయత్నం కేసును నమోదు చేశారు. బైక్ ను నడిపిన వ్యక్తిని ఫయాజ్ గా పోలీసులు గుర్తించారు.
కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వీడియో ను తీసింది గత సంవత్సరంలో అని తేలింది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీస్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సజ్జనార్ సూచించారు.