ప్రపంచంలోనే “వృక్ష శిలీంద్రం” సోకిన మొదటి వ్యక్తిగా రికార్డ్ !

-

ఇంతకు ముందు మనము చాలా సార్లు చెప్పుకున్న విధంగానే అప్పుడప్పుడు ప్రపంచంలో వింతలు జరుగుతుంటాయి. అదే విధంగా తాజాగా ఒక వార్త అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. మాములుగా వృక్షాలు వ్యాధులకు గురవుతూ ఉంటాయి.. అయితే ఈ వ్యాధులకు కారణం “కొండ్రోస్టీరియమ్ పోర్పోరియం” అనే శిలీంద్రం అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం కోల్కత్తాకు చెందిన ఒక శాస్త్రవేత్తకు ఈ శిలీంద్రం సోకిందట.

ఈయన కూడా మొక్కల గురించి పరిశోధన చేసే శాస్త్రవేత్త , ప్రస్తుతం ఇతని వయసు 61 సంవత్సరాలుగా ఉంది. ఈ వ్యాధి సోకిన మొదటి వ్యక్తిగా ఇతను రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. ఈ వ్యాధి వలన గొంతు బొంగురుపోవడం, ఆయాసం, దగ్గు , ఆకలి అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version