అరవింద్‌కు ‘పసుపు’ దెబ్బ..ఈ సారి గట్టెక్కలేరా?

-

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..ఒకసారి గెలిచామని..పదే పదే గెలుస్తామనే ధీమా ఉంటే దెబ్బతినడం ఖాయం. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోకపోయినా ఎదురుదెబ్బలు తప్పవు. సరిగ్గా ఇప్పుడు నిజామాబాద్ బి‌జే‌పి ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో అదే జరుగుతుంది. ప్రస్తుతం నిజామాబార్ లో ఆయనకు వ్యతిరేకంగా పరిస్తితులు కనిపిస్తున్నాయి. పైగా బి‌ఆర్‌ఎస్ పార్టీ మరింత వ్యతిరేకత పెరిగేలా చేస్తుంది.

అసలు గత ఎన్నికల్లో ఊహించని విధంగా అరవింద్ బి‌జే‌పి నుంచి పోటీ చేసి గెలిచారు. నిజామాబాద్ చరిత్రలో బి‌జే‌పి ఎప్పుడు అక్కడ గెలవలేదు. కానీ మోదీ వేవ్ లో అరవింద్ గెలిచేశారు. పైగా అప్పటివరకు ఎంపీగా ఉన్న కవితపై వ్యతిరేకత ఉండటం అరవింద్ కు కలిసొచ్చింది. అలాగే అక్కడ ప్రధానంగా ఉన్న పసుపు రైతులు కవితకు వ్యతిరేకంగా నామినేషన్లు వేయడం, పసుపు బోర్డు తీసుకోస్తానని అరవింద్ హామీ ఇవ్వడంతో రాజకీయం మారిపోయింది. అనూహ్యంగా 70 వేల ఓట్ల మెజారిటీతో అరవింద్ గెలిచారు.

అలా మోదీ వేవ్ లో గెలిచేసిన అరవింద్ కు ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ఎంపీగా నిజామాబాద్ కు పెద్దగా చేసిందేమి లేదని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని కేంద్రం చేతులు ఎత్తేయడంతో అరవింద్‌కు రివర్స్ అయింది. అందుకే తాజాగా కొందరు..పసుపు రంగు ఉన్న బోర్డులని నిజామాబాద్ లో అక్కడకక్కడ పెడుతూ..ఇదిగో మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఈ పరిణామాలు అరవింద్‌కు పెద్ద మైనస్ అవుతున్నాయి. ఇచ్చిన మాట తప్పడంతో సీన్ రివర్స్ అవుతుంది. పైగా ఈసారి అనుకున్న మేర మోదీ వేవ్ ఉండే ఛాన్స్ లేదు. అదే సమయంలో మోదీని టార్గెట్ చేసుకునే కే‌సి‌ఆర్ రాజకీయం ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల్లో అరవింద్ గెలిచి గట్టెక్కడం కష్టమే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version