Keerthy Suresh : ‘దసరా’ డీగ్లామర్ లుక్​ కోసం కీర్తి ఎలా రెడీ అయిందంటే..?

-

దసరా సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఓవైపు విమర్శకులు ప్రశంసలు అందుకుంటూనే మరోవైపు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన ఇద్దరు నేచురల్ స్టార్స్.. నాని, కీర్తి సురేశ్​ల నటనకు తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.

పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ అయిన దసరా సినిమా అన్ని భాషల్లోనూ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ వెన్నెల అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో కీర్తి పూర్తిగా డీ గ్లామర్ లుక్​లో కనిపించింది. దాని కోసం భారీ మేకప్ వేసుకుంది. తన పాత్ర కోసం కీర్తి ఎంత కష్టపడిందో.. వెన్నెలగా మారడానికి కీర్తికి ఎంత టైం పట్టిందో తెలియజేస్తూ ఈ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కీర్తి వెన్నెల పాత్ర కోసం మేకప్ వేసుకుంటూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వెన్నెల కోసం కీర్తి ఎంత కష్టపడిందో అంటూ పొగిడేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version