వీడియో వైరల్.. ఆలియా భట్ లాగ పిజ్జా బాయ్ తో ప్రాంక్…!

-

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఒక అమ్మాయి అచ్చం ఆలియా భట్ లాగ మిమిక్రీ చేసి పిజ్జా అబ్బాయిని ఒక ఆట ఆడేసుకుంది. అయితే ఇంతకీ ఆమె ఎవరు అనేది చూస్తే… పిజ్జా బాయ్ కి ఫోన్ చేసి ఒక ఆట ఆడేసుకున్న ఆ అమ్మాయి మిమిక్రీ ఆర్టిస్ట్. ఆమె పేరు చాందిని. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఆమె పిజ్జా అబ్బాయిని ప్రాంక్ చేసింది.

 

అలియా భట్ మాట్లాడినట్లు హలో అని ఆమె షాక్ ఇచ్చింది. ఆమె అతనితో ఫోన్లో అచ్చం ఆలియా లాగ మాట్లాడింది. రన్బీర్ కపూర్ పేరును కూడా ఆమె మధ్యలో చెప్పింది. అయితే ఆమె పక్కన రణ్బీర్ కూర్చుని ఉన్నట్లు ఆమె పిజ్జా డెలివరీ బాయ్ ని నమ్మించింది. ఆమె పేరు ఏమిటి అని అబ్బాయి అడగగా అలియాభట్ అని ఆమె సమాధానమిచ్చింది.

https://www.instagram.com/reel/CbzO969AKAG/?utm_source=ig_web_button_share_sheet

అలానే ఆమె ఎక్కడి నుంచి ఫోన్ చేసింది అది కూడా అతను అడిగాడు. ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ చాందిని కి ఇంస్టాగ్రామ్ లో 40 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వీడియోని ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అలానే పిజ్జా బాయ్ ని ప్రాంక్ చేశాను అని కూడా ఆమె చెప్పారు. వైరల్ అయిన ఈ వీడియోని చూసి చాలా మంది నవ్వుకున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసి నవ్వుకోండి. ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె టాలెంట్ కి ఫిదా అయిపోయారు. ఆలియా రాక్స్ పిజ్జా బాయ్ షాక్స్ అని కామెంట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news