ఆర్‌సీ 15లో విభిన్నమైన పాత్రలో రామ్ చరణ్..సినిమా మేకింగ్‌లో శంకర్ ఫుల్ బిజీ..

-

ప్రజెంట్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టైమ్ బాగా నడుస్తున్నదని చెప్పొచ్చు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ తన నట విశ్వరూపం చూపించారు. అల్లూరి సీతా రామరాజు, పవర్ ఫుల్ అండ్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్, గొప్ప స్నేహితుడు, మరదలుకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బావగా ఇలా రకరకాల వేరియేషన్స్ ఉన్న రామరాజు పాత్రను పోషించారు. ఇందుకు ఆయన డిఫరెంట్ గెటప్స్ కూడా వేసుకున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ది ఒకే ఒక గెటప్ కాగా, రామ్ చరణ్ మాత్రం మూడు గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు. ఈ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ఈ సంగతులు పక్కనబెడితే..ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘ఆర్ సీ 15’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ఆర్ సీ 15’ మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందించగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజకీయ అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు రాగా తాజాగా ఈ చిత్రం ప్రభుత్వ వైఫల్యాలను గురించి తెలిపేలా ఉంటుందని వినికిడి.

పిక్చర్ లో రామ్ చరణ్ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారని టాక్. గవర్నమెంట్ ఎంప్లాయి, స్టూడెంట్ .. రోల్స్ ను రామ్ చరణ్ ప్లే చేస్తాడని సమాచారం. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news