సూపర్.. భలే బుద్ధి చెప్పావు.. శెభాష్!

-

అంటూ.. ఆ యువతిని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఆ యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్వచ్ఛత, పరిశుభ్రం అంటూ ప్రభుత్వాలు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం వాళ్లు చేసే పని చేస్తూనే ఉంటారు. రోడ్లు మీద చెత్త వేయొద్దు అంటూ నెత్తినోరు మొత్తుకుంటున్నా ఎవరూ వినరు. అందుకే.. ఓ మహిళ చేసిన పనికిమాలిన పనికి ఆ యువతి సరైన బుద్ధి చెప్పింది.

చైనాలోని బీజింగ్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద సిగ్నల్ పడగానే ఓ కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఓ చెత్త సంచిని రోడ్డు మీద పడేసింది కారులోని మహిళ. అప్పుడే అక్కడ వచ్చి ఆగిన బైక్ మీద ఉన్న యువతి రోడ్డు మీద చెత్తను గమనించి ఆ చెత్తను తీసి ఆ కారులోకి విసిరేసింది. అంతే.. కారు లోపల కూర్చున మహిళ షాక్ అయింది. వెంటనే కారు దిగి ఆ యువతిని ఆపబోయింది. కానీ.. అప్పటికే ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version