40 వేల ఏళ్ల నాటి తోడేలు తల.. ఇప్పటికీ అలాగే ఫ్రెష్ గా ఉంది.. ఎక్కడో తెలుసా?

-

మీకు భారీ ఏనుగుల గురించి తెలుసా? ఇప్పుడున్న ఏనుగుల కంటే కూడా ఇంకా భారీగా ఉండేవి ఆ ఏనుగులు. ఇప్పుడు లేవు కానీ.. ఆఫ్రికాలో 40 వేల ఏళ్ల కింద ఆ ఏనుగులు ఉండేవట. ఆసమయంలోనే రష్యాలోని సైబీరియాలో భారీ తోడేళ్లు ఉండేవట. అవి కూడా భారీ ఆకారంలో ఉండేవట.

ఎవరైనా చనిపోతే ఒక్కరోజులోనే వాళ్లకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి. లేదంటే శరీరం వాసన వస్తుంది. తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి. మరి.. ఒక్క సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. 40 వేళ్ల ఏళ్ల నాటి తోడేలు తల ఇప్పటికీ ఫ్రెష్ గా అలాగే ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే.

మీకు భారీ ఏనుగుల గురించి తెలుసా? ఇప్పుడున్న ఏనుగుల కంటే కూడా ఇంకా భారీగా ఉండేవి ఆ ఏనుగులు. ఇప్పుడు లేవు కానీ.. ఆఫ్రికాలో 40 వేల ఏళ్ల కింద ఆ ఏనుగులు ఉండేవట. ఆసమయంలోనే రష్యాలోని సైబీరియాలో భారీ తోడేళ్లు ఉండేవట. అవి కూడా భారీ ఆకారంలో ఉండేవట.

అప్పట్లో జీవించిన ఓ తోడేలు తలను తాజాగా గుర్తించారు. రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన పరిశోధకులు దాన్ని గుర్తించారు. దాని తలను గుర్తించిన పరిశోధకులు షాక్ అయ్యారు. ఎందుకుంటే.. అది 40 వేల ఏళ్ల నాటిది. అయినప్పటికీ దాని తల మాత్రం ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఎందుకంటే.. అది మంచులో కూరుకుపోయి ఉండటమే. మంచులో కూరుకుపోయి ఉండటం వల్ల అది అలాగే ఫ్రెష్ గా ఇప్పుడే చనిపోయిన దానిలా ఉంది.

సైబీరియాలో ఇప్పటికే చాలా తోడేళ్ల కళేబరాలు దొరికాయి. కానీ.. వాటిలో ఎటువంటి కణజాలం లేదు. కానీ.. తాజాగా దొరికిన తోడేలు తలలోని మెదడు కూడా ఇంకా తాజాగా ఉందట. చెవులు, నాలుక కూడా ఫ్రెష్ గా ఉన్నాయట.

సైబీరియాలో ఎప్పుడూ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలే ఉంటాయి. అక్కడ ఎప్పుడూ మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే తోడేలు తల అలాగే ఫ్రెష్ గా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దాన్ని ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయిస్తున్నారు. దాని వల్ల 40 ఏళ్ల క్రితం తోడేళ్లు ఎలా ఉండేవి.. వాటి జీవన స్థితుల గురించి తెలుసుకునే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version