వైరల్ వీడియో; ఈ బుడ్డోడు మామూలోడు కాదు, ముళ్ళ పందితో స్నేహం…!

501

పిల్లలతో జంతువులు స్నేహం చేయడం అనేది మనం తరుచుగా చూస్తూనే ఉంటాం. వాళ్లకు ఏమీ తెలియదు కాబట్టి ప్రమాదకర జంతువులతో కూడా పిల్లలు ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. వాటి వలన ప్రమాదాల బారిన కూడా పడుతూ ఉంటారు. ఏదైనా జంతువు వింతగా కనపడితే చాలు వాళ్ళు వదలకుండా స్నేహం చేస్తూ ఉంటారు. అవి కూడా పిల్లలను ఎక్కువగా ఇష్టపడతాయి.

తాజాగా ఒక చిన్న పిల్లాడు తన ముళ్ళ పంది స్నేహితుడితో కలిసి విహరిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ పోస్ట్ చేసారు. బాలుడు రోడ్డు పక్కన నడుస్తున్నప్పుడు ఒక ముళ్ళ పంది ఆ బాలుడ్ని అనుసరిస్తుంది. ఇది తన స్నేహితుడు ఫార్వార్డ్ చేసాడని ఆయన పేర్కొన్నారు. ఆ జంతువు తనను అనుసరిస్తున్నప్పుడు,

పిల్లాడు రోడ్డు పక్కన షికారు చేస్తున్నట్లు వీడియోలో ఉంటుంది. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పలువురు దీనిపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఆ పందిని చూడండి, ఆ పిల్లాడిని ఎంత ఇష్టపడితే అది అతన్ని అనుసరిస్తుంది. అందుకే పిల్లలకు జంతువులు ఎప్పుడు మంచి స్నేహితులే అని కామెంట్ చేసారు. మరికొందరు అయితే దాని వలన పిల్లాడికి ప్రమాదం ఉండవచ్చు తల్లి తండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.