బర్తడే రోజు కేక్‌ తిన్న కాసేపటికే చనిపోయిన పదేళ్ల బాలిక

-

బయట ఆహారం తినొద్దని ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెప్తూనే ఉన్నారు. కానీ ఎవరూ వినడం లేదు. జంక్‌ ఫుడ్స్‌ ప్రభావం ఆరోగ్యంగా త్వరగా ప్రభావం చూపించకపోయినా.. ఫ్యూచర్‌లో తప్పు తెలుసుకుంటారు.. కానీ కొన్ని ఆహారాల వల్ల ఎఫెక్ట్‌ వెంటనే ఉంటుంది. అలాంటిదే ఈ ఘటన.. పుట్టినరోజు నాడు కుటుంబంతో సంతోషంగా కేక్‌ కట్‌ చేసిన బాలిక అదే కేక్‌ వల్ల చనిపోయింది. కేక్‌ తిన్న కాసేపటికే మృతి చెందింది.. చేతులారా విషాన్ని పాపకు పెట్టామని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పంజాబ్‌లోని పాటియాలాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్చి 24న పాటియాలాలోని ఓ బేకరీలో ఆన్‌లైన్‌లో కేక్‌ ఆర్డర్‌ చేసి రాత్రి 7 గంటల ప్రాంతంలో కేక్‌ కట్‌ చేశామని.. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో కుటుంబసభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని మృతురాలి తాత హర్బన్ లాల్ తెలిపారు. మాన్వి మరణానికి కొన్ని గంటల ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మాన్వి తల్లి కాజల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ‘కన్హా బేకరీ’ షాపుపై సెక్షన్ 304-ఎ (నిర్లక్ష్యం కారణంగా మరణం) మరియు 273 కింద కేసు నమోదు చేశారు. పాటియాలాలోని ‘కేక్ కన్హా’ నుంచి ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్‌లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. “బేకరీ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, కేక్ నమూనాను కూడా పరీక్ష కోసం పంపారని, నివేదికల కోసం ఎదురు చూస్తున్నాము, ”అని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఏది ఏమైనా కేక్‌ వల్ల ప్రాణం పోయింది.. పాప కేక్‌ కట్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.. ఎంతో సంతోషంగా నవ్వుతూ పాప పుట్టినరోజును ఎంజాయ్‌ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 5.7M వ్యూస్‌ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news