SRH VS CSK మ్యాచ్ టికెట్లపై HCA అధ్యక్షుడు ఎ.జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరగనున్న చెన్నై వర్సెస్ హైదరాబాద్ నకిలీ మ్యాచ్ టిక్కెట్లను కొందరు సోషల్ మీడియాలో విక్రయిస్తున్నట్టు వస్తున్న వదంతులు పట్ల క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండండని ఆయన కోరారు.

చెన్నై వర్సెస్ హైదరాబాద్ నకిలీ మ్యాచ్ టిక్కెట్ల విషయంలో అసత్య ప్రచారాలను చూసి మోసపోవద్దని కోరారు. ఎవరైనా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా అనాధికారికంగా టిక్కెట్లు విక్రయిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే వెంటనే మాకు తెలియజేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండని స్పష్టం చేశారు HCA అధ్యక్షుడు ఎ.జగన్ మోహన్ రావు.