తెలంగాణలో ప్రతీ గింజ కొంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ మిగలరు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ మిగలదు. ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కి లేదన్నారు. ఇరిగేషన్ సెక్టార్ ను నాశనం చేసిందే కేసీఆర్. తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కమీషన్ల కక్కుర్తితో డిజైన్లు మార్చి ప్రాజెక్టులు కట్టారు. నీళ్లు నిలువ చేయవద్దని ఎన్డీఎస్ఏ సలహా ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం.. వారి హయాంలోనే బీటలు పారిందన్నారు.
కేసీఆర్ భయంతో ఉన్నారు. అందుకే పొలం బాట పట్టారు. కరెంట్ పోయిందని కేసీఆర్ తప్పుడు మాటలు చెబుతున్నారు. జనరేటర్ ఆగిపోతే ఆ బాధ్యత కూడా మాదేనా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో తమ ప్రభుత్వ హయాంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుని అప్పగించింది కేసీఆర్ అని పేర్కొన్నారు.