అవి బాతు పిల్లలా లేక అతడి పిల్లలా… వైరల్ వీడియో

-

కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఇంత ప్రేమ చూపించరు కావచ్చు.. కానీ ఈ వీడియో చూడండి.. ఆ వ్యక్తి వెనుక బాతు పిల్లలు ఎలా పరిగెడుతున్నాయో. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి అవి. అతడు కూర్చోమంటే కూర్చుంటాయి. నిలుచోమంటే నిలుచుకుంటాయి. ఇక.. అతడు ఏది చెబితే అది వాటికి.

దక్షిణ కొరియాకు చెందిన ఆ వ్యక్తికి పక్షులను పెంచుకోవడమంటే ఇష్టమట. అందుకే బాతుల పెంచుకోవడం ప్రారంభించాడు. అవి ఇప్పుడు మొత్తం 21 బాతు పిల్లలు అయ్యాయి. వాటి తల్లలు వద్ద కూడా అవి ఉండవట. అతడితోనే తిరుగుతాయట. బాతులు గుడ్లను పొదిగాక ఆ గుడ్ల నుంచి బయటికి వచ్చినప్పుడు అతడినే చూడటంతో ఇక.. అతడే తమ తల్లి కావచ్చు అని అతడితోనే ఉంటున్నాయి అవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version