హే బుల్ బుల్.. హే బుల్ బుల్.. బాలయ్య పాట..! వీడియో

-

ప్లేసు నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. అబ్బ.. ఏం చెప్పావు అంటూ విజిల్ వేస్తాం. అది బాలయ్య డైలాగ్ పవర్ అంటే. కానీ.. అది కేవలం సినిమాలోనే. అవును.. వెండి తెర మీదనే బాలయ్య ప్రతాపాలు. నిజ జీవితంలో మాత్రం.. ఆ.. ఆ..ఆ.. మరి.. అప్పట్లో.. అంటూ డైలాగ్ చెప్పవయ్యా అంటే దాన్ని నమిలి మింగేస్తుంటాడు బాలకృష్ణ. అలాంటి వీడియోలు మనం చాలానే చూశాం. ఇప్పుడు ఇంకోటి.. ఇప్పుడు ఎన్నికల సీజన్ కదా. బాలయ్య టీడీపీ తరుపున తెలంగాణలో ప్రచారం చేస్తున్నాడు. తన ప్రసంగం మధ్యలో సారే జహాసె అచ్ఛా.. అంటూ దేశ భక్తి గీతాన్ని పాడబోయాడు. కానీ.. మధ్యలో మరచినట్టున్నాడు.. అందుకే.. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆ గేయాన్ని ఎలా పాడాడో మీరే ఈ వీడియోలో చూడండి. నెటిజన్లు కూడా బాలయ్య ప్రసంగాన్ని చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version