రేయ్.. ఎవడ్రా.. దొంగలు దేనికీ పనికిరారని.. వీడు చూడండి.. ఏకంగా 15 వేల జీతం ఇచ్చి మరీ దొంగలను పెంచి పోషిస్తున్నాడు. వచ్చాయ్ రా.. దొంగలకు కూడా మంచి రోజులు వచ్చాయి. దేవుడు ఉన్నాడు బాసు.. ఉన్నాడు.. పక్కా ఉన్నాడు. ఎహె.. నీ సొల్లు ఆపి అసలు మ్యాటర్ చెప్పవయ్యా అంటారా? సరే.. సరే.. పదండి.. అలా రాజస్థాన్ వెళ్లొద్దాం.
రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఆశిష్ మీనా అనే 21 ఏళ్ల కుర్రాడే దొంగలకు ఉద్యోగాలను ఆఫర్ చేసింది. కాకపోతే అతడు జాబ్ లోకి తీసుకున్న వ్యక్తులు ఆఫీసుకు వెళ్లేదేమీ ఉండదు. వాళ్ల టైమింగ్స్ లో బయట దొంగతనం చేయాలి. బంగారు నగలు కొట్టేయాలి.. మొబైల్స్ కొట్టేయాలి.. డబ్బులు కొట్టేయాలి.. బైకులు దొంగలించారు.. ఇంట్లో చోరీ చేయాలి.. ఇలా.. వాళ్లకు డిఫరెంట్ టాస్కులు అసైన్ చేస్తాడన్నమాట. మొత్తం ఆరుగురిని రిక్రూట్ చేసుకొని మూడు పువ్వులు ఆరు కాయలుగా తన వ్యాపారం సాగింది. కానీ.. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిచి చివరకు పోలీసులకు తెలిసింది. దీంతో మనోడి గురించి తీగ లాగితే డొంక కదిలింది. మనోడి ఆఫీసుపై రైడ్ చేసి ఫోన్లు, ల్యాప్ టాప్స్, బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీళ్లంతా ఇప్పటి వరకు 35 కు పైగా దొంగతనాలు చేశారని పోలీసులు వెల్లడించారు.