ప్రపంచంలో ఇదో పెద్ద వింత.. తల లేకుండా 18 నెల‌లు బ్రతికిన కోడి..!!!

-

ఈ వింత వినడానికి అదేదో విటలాచార్య సినిమాలో సీన్ లా అనిపించినా ఇది నిజంగా నిజం.తల లేకుండా ఓ కోడి సుమారు 18 నెలలు బ్రతికింది. అంతేకాదు ప్రపంచం నివ్వెర పోయేలా చేసింది. ఇది నిజమా అంటూ ఆ కోడిని చూడడానికి ఎంతో మంది బారులు తీరేవారట. సరే ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు ఆ కోడికి తల ఎలా పోయింది. ఎందుకు పోయింది, తల లేకుండా ఎలా బ్రతికిందో ఇప్పుడు తెలుసుకుందాం..

1945 సమయంలో ఒకరి ఇంట్లో కోడి పుట్టింది. డానికి మైక్ అనే పేరు కూడా పెట్టారు. అయితే అది ఇంట్లో నుంచీ  చికెన్ సెంటర్ కి షిఫ్ట్ అయ్యింది. చావడానిfeaకి సిద్దంగా ఉన్న మైక్ అనే  కోడిని లాయిడ్ అనే వ్యక్తి ఇంటికి తెచ్చుకున్నాడు. కత్తితో ఒక్క వేటు వేయగానే భయంతో పరుగులు పెట్టె క్రమంలో ఆ కోడి మెడ తెగిపోయింది కానీ శరీరానికి, మెదడుకి కీలకంగా పనిచేసే జగ్లర్ అనే నరం అలాగే ఉండిపోయింది. అయితే ఎలాగైనా దానిని వండుకోవాలని అనుకున్న లాయిడ్ దాని అరుపులు విని చలించి పోయాడు.

మైక్ ని ఎలాగైనా సరే బ్రతికించాలని అనుకున్నాడు. చెవి భాగం వరకూ మెడ తెగిపోవడంతో చేసేది లేక వైద్యుల సలహా మేరకు చిన్న సిరంజ్ ల ద్వారా, పొట్టలోకి వెళ్ళేలా చేశాడు. చిన్న చిన్న పురుగులు, ధాన్యాలు కూడా అలాగే పొట్టలోకి పంపేవాడట. ఈ క్రమంలోనే ఆ మైక్ కోడి విషయం చుట్టుపక్కల అందరికి తెలిసిపోయింది. మైక్ చాలా ఫేమస్ అయ్యిపోయింది. జనాలు తండోపతండాలుగా రావడంతో లాయిడ్ కోడిని చూడాలంటే టిక్కెట్టు తీసుకోవాలి అంటూ షరతులు పెట్టాడు, దాంతో అతడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ ఘటన తరువాత మైక్ సుమారు సంవత్సర పాటు బ్రతికి చివరికి ప్రాణాలు విడిచిందని అప్పట్లో ఈ ఘటన ఎంతో ప్రాచుర్యం పొందింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version