నాగుపామును మింగి అరిగించుకోలేక కక్కేసిన మరో నాగు.. వీడియో

-

మనిషి మనిషిని తినే రోజుల్లోకి వచ్చేశాం. ఓ పాము మరో పామును మింగేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు కానీ.. ఇటువంటి ఘటనలను ప్రత్యక్షంగా చూడటం చాలా అరుదు కదా. అవును.. ఓ నాగుపాము మరో నాగుపామును లటక్కున మింగేసింది. తర్వాత దాని అవస్థలు చూడాలి. ఆయాసంతో అది పడుతున్న బాధలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. చివరకు స్నేక్ రెస్క్యూ టీమ్ వచ్చి దాని చేత నాగుపామును కక్కించారు. అప్పుడు కానీ.. దాని బాధ తీరలేదు. ఈ ఘటన ఒరిస్సాలోని పూరీ జిల్లాలో ఉన్న సత్యబాడి అనే ఊళ్లో చోటు చేసుకున్నది. ఆ నాగు మరో నాగుపామును కక్కుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version