మరీ ఇంత సోమరితనం పనికిరాదమ్మా.. వీడియో

-

సోమరితనం.. ఇదే మనిషిని నాశనం చేసేది. ఎంత డబ్బు ఉన్నా.. తెలివి ఉన్నా.. సోమరితనం ఒక్కటి ఉంటే చాలు.. అన్నీ మటాష్ అయిపోతాయి. సోమరితనం వల్ల ఎంతోమంది రోడ్డు మీద పడ్డ ఘటనలను కూడా చూశాం. అయితే.. అది మనుషులకు. కానీ.. కుక్కకు సోమరితనం ఉంటే ఏమౌతుంది. అది ఇంకా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ వీడియో చూడండి.. ఓ కుక్క పాలు తాగడానికి కూడా ఎంత కష్టపడుతున్నదో. పాపం.. దానికి నిద్ర వస్తున్నదో లేక లేచి కూర్చొని పాలు తాగేంత ఓపిక లేదో కానీ.. అలాగే పడుకొని పాలు తాగింది. తర్వాత అలాగే నిద్రపోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంత కుక్క అయితే మాత్రం మరీ ఇంత సోమరితనమా? ఇంత సోమరితనం పనికిరాదమ్మా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version