చనిపోయిన వారిని ఆ దేవాలయంలో బ్రతికించవచ్చట తెలుసా..?

-

ప్రపంచమంతా ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశగా పరుగులు తీస్తోంది. ప్రతి ఒక్క పనికి టెక్నాలజీ వాడకం అధికమైపోయింది. దీంతో మానవుడి మనుగడ సులభతరమైంది. అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి చావును మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. మృత్యువు అంటూ వచ్చాక దానికి స్వాగతం చెప్పాల్సిందే కానీ.. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే మన దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలో మాత్రం చనిపోయిన వారిని బతికించవచ్చట. ఏంటీ.. షాకింగ్‌గా ఉందా..? మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

డెహ్రాడూన్‌కు 125 కిలోమీటర్ల దూరంలో లఖమండల్ దేవాలయం ఉంది. ఇందులో శివున్ని, ఆది పరాశక్తిని కొలుస్తారు. లఖ్‌మండల్ అంటే లక్ష శివ లింగాలు అన్నమాట. 8వ శతబ్దాంలో లక్ష శివ లింగాలు ఇక్కడ ఉండేవట. కానీ కాలక్రమేణా అవి అంతరించిపోయాయట. ఇక ఈ దేవాలయానికి సంబంధించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఒకసారి బ్రహ్మ, విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటారు. దీంతో వారి మధ్యలో భారీ శివలింగం వెలుస్తుంది. దాని ఆది, అంతం చూసేందుకు బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ చెరో వైపుకు వెళ్తారు. కానీ వారు ఎంత దూరం వెళ్లినా శివలింగం ఆది, అంతం కనిపించవు. దీంతో వారు తమ ఓటమిని అంగీకరిస్తారు. అప్పుడు శివుడు వారిని తగవులాడుకోవద్దని చెప్పి పంపుతాడు. అలా ఆ శివలింగం ఈ ప్రాంతంలోనే ఏర్పడిందని, అందుకనే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగిందని చెబుతారు. ఇక మరో కథ ఏమిటంటే…

 

అరణ్యవాసంలో ఉన్న పాండవులు లక్క ఇంట్లో నిద్రిస్తుండగా, అది తెలుసుకున్న కౌరవులు ఆ ఇంటిని మంటలకు ఆహుతి చేస్తారు. కానీ నిద్రపోతున్న పాండవులను ఆది పరాశక్తి వచ్చి రక్షిస్తుందట. దీంతో ఆ ప్రదేశంలో ఈ ఆలయం నిర్మాణమైందని చెబుతారు. అందుకే ఇక్కడ ఆది పరాశక్తిని కూడా కొలుస్తారు.

ఇక లఖమండల్ ఆలయానికి చెందిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న రెండు ద్వారపాల బొమ్మల మధ్య చనిపోయిన వారి మృతదేహాలను ఉంచి వారిపై ఆలయ కొలనులోని నీరు చల్లితే వారు బతుకుతారని, కొంతసేపు వారు బతికి శివ నామ స్మరణ చేసి, మళ్లీ జలం చల్లగానే చనిపోతారని కథ ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగంపై నీరు పోస్తే ఆ లింగంపై మన ప్రతిబింబం అద్దంలో వలె కనిపిస్తుంది కూడా. ఇక ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున సంతానం లేని దంపతులు పూజ చేస్తే వారికి సంతానం కలుగుతుందని ప్రచారంలో ఉంది. మరి ఈ ఆలయం మీక్కూడా చూడాలని ఉంటే వెంటనే వెళ్లి రండి మరి..!

Read more RELATED
Recommended to you

Latest news