ఆసుపత్రిలో తిరుగుతూ.. సీసీ కెమేరాకి దొరికిపోయిన దెయ్యం.. ?

-

దెయ్యాలున్నాయా.. ఇదొక ఇంట్రస్టింగ్ టాపిక్.. దీనిపై మనిషి భూమి మీద ఉన్నప్పటి నుంచి అనేక వాదనలు ఉన్నాయి.. దెయ్యాలు లేవు అని నాస్తిక వాదులు వాదిస్తే.. అబ్బే బ్రహ్మండంగా ఉన్నాయి.. అనే భూతవైద్యులు, భూత నిపుణులు చాలా మంది ఉన్నారు. భూతవైద్యం, దెయ్యాలపైన చాలా మంది ఆధారపడి బతుకుతున్నారు కూడా. అలాంటి వారిలో సినీ నిర్మాతలు, రచయితలు కూడా ఉన్నారని చెప్పొచ్చు.

అయితే ఇదిగో దెయ్యం.. ఫోటోకి చిక్కింది.. ఇదిగో దెయ్యం.. వీడియోలో వచ్చింది.. అంటూ మనకు యూట్యూబుల్లో సోషల్ మీడియాలో చాలా ఫోటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిలో చాలావరకూ ఫేక్ అని ప్రచారం కోసం అలా కొందరు సృష్టిస్తారని కూడా చెబుతారు. కానీ తాజాగా ఓ ఆసుపత్రిలో దెయ్యం తరహా ఘటన కలకలం రేపుతోంది.

ఛండీగఢ్ లోని ఓ ఆసుపత్రిలో ఓ వీల్ చైర్ దానంతట అదే ముందుకెళ్లడం సీసీ కెమేరాలో రికార్డయ్యింది. ఏదో కొద్దిదూరం అటూ ఇటూ కదిలితే గాలికో.. వేరే ప్రభావంతోనో కదిలిందనుకోవచ్చు. కానీ.. కానీ కాస్త దూరం కాదు.. చాలా దూరం అలా కదులుకుంటూ వెళ్లింది. ఎలాంటి దారం, ఆధారం లేదు.

పోనీ.. ఇదేదో ఫేక్ వీడియో అనుకుందామా.. అంటే.. అది ఆసుపత్రి సీసీ కెమేరా ఫుటేజ్.. ఏ ఆసుపత్రి కూడా దెయ్యాల వీడియోలు రిలీజ్ చేసి తమ ఆసుపత్రికి చెడ్డపేరు తెచ్చుకోదు. అంతేకాదు.. ఈ ఆసుపత్రిలో ఇలా వస్తువులు కదలడం.. ముందుకు వెళ్లిపోవడం ఇది రెండో సారట. అంతకుముందు మార్చురీ దగ్గర ఓ స్ట్రెచర్ ఇలాగే కదిలి వెళ్లిపోయిందట. ఈ ఘటన మరోసారి దెయ్యాల ఉనికిపై చర్చకు దారి తీసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version