ఏమి గుండెరా వాడిది… ఆ గుండె పది కాలాల పాటు బ్రతకాలి… మరో పది గుండెల్ని బ్రతికిస్తాది..

-

ఏమి గుండెరా వాడిది…ఆ గుండె పది కాలాల పాటు బ్రతకాలి… మరో పది గుండెల్ని బ్రతికిస్తాది…. ఇది మిర్చి సినిమాలోని ఫెమాస్ డైలాగ్. నెటిజన్లు ఈ డైలాగ్ ని ప్రతిదానికి తెగ వాడేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పబోయే లవర్ బాయ్ కి ఈ డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. గుండెకు సంబంధించిన ప్రశ్నకు తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.సాధారణంగా పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. అందులోని నాలుగు గదులను వివరించే క్రమంలో వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.

గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరుకి బదులు ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో చక్కగా వివరించాడు.ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుందని, స్నాప్‌చాట్‌లో తనతో టచ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను టెంప్ట్ చేస్తుందని రాసుకొచ్చాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత అందమైన తన క్లాస్‌మేట్ అని పేర్కొన్నాడు.

ఎగ్జామ్ లో ఆ విద్యార్థి రాసిన సమాధానం చదివిన టీచర్‌ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురమ్మని ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.అటు విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా… ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్‌ స్పందించారు.మరొకరు మిర్చి డైలాగ్ పెట్టి పది కాలాల పాటు చల్లగా ఉండు బిడ్డా… మరో పది మందికి నువ్వే ఆదర్శం అంటూ ఆశీర్వాదం ఇచ్చేశారు.మొత్తానికి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటివి మంచి ఫన్ అందిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version