ఇలాంటి శ్మశానం ఒకటి ఉందని.. మీరు కలలో కూడా విని ఉండరు..!

అవును.. ఈ ప్రపంచంలో చాలా వింతలున్నాయి. మనకు తెలియని ఎన్నో విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటిదే ఇది కూడా. సహజంగా మనుషులు మరణిస్తే శ్మశానానికి తరలిస్తారు. ఇలాంటి శ్మశానాల సంగతి మనం చాలా విని ఉన్నాం. ఎంత సంపాదించినా.. ఎన్ని ఘనకార్యాలు చేసినా అంతా చివరకు అక్కడికు వెళ్లాల్సినవారమే కదా.

మనుషుల సంగతి సరే.. మరి కొన్ని వస్తువులు, వాహనాల మాటేమిటి.. కార్లు అవి కదలకపోతే షెడీకి పంపిస్తారు. మరి సముద్రంలో నడిచే షిప్పులకు కాలం చెల్లితే ఏం చేస్తారు. మిగిలిన ప్రపంచం సంగతి ఎలా వున్నా న్యూయార్క్ నగరం సమీపంలోని స్టాటెన్ ద్వీపం నౌకలకు శ్మశానంగా వాడుతున్నారు.

అవును.. మరి.. ఇక్కడ పాత నౌకలు వందల ఏళ్ళ కిందటివి అక్కడ వదిలేస్తున్నారు. అందులో చెక్కతో తయారై నవి, ఇనుముతో తయారైనవి వున్నాయి. ఇప్పటి నుంచే కాదు.. 1880 నుంచి అలా వదిలివేసిన నౌకలు అక్కడ వందల సంఖ్యలో ఉన్నాయట. తుప్పుపట్టి, సగం మునిగి, సగం తేలుతూ వుంటాయి.

అవి ఎంత పాతగా ఉంటాయంటే.. తుప్పుపట్టిన ఆ నౌకలమీద కాలువెయ్యటానికే భయపడే పరిస్థితి. ఇప్పుడు ఈ స్టాటెన్ ద్వీపం కూడా ఓ టూరిస్టు స్పాట్ అయ్యింది. టైటానిక్ తరహాలో ఇక్కడ ఎన్నో పాత నౌకలు ఉన్నాయి. ఈ దీవిని నౌకల శ్మశానంగా పిలుస్తున్నారు.