ఈ చేప ధర ఎంతో తెలిస్తే మీరు అవాక్కవాల్సిందే..!

-

చేపలు.. ఆరోగ్యానికి ఎంతో మంచివి. డాక్టర్లు కూడా చేపలు తినాలంటూ సూచనలు ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు తమ ఆహారంలో చేపలను భాగం చేసుకోవాలని చెబుతుంటారు. అందుకే చాలా మంది చేపలను తినడం కోసం ఎగబడతారు. అయితే.. ఏ చేపలు అయినా కూడా 500 లేదా 600 కంటే ఎక్కువ ధర పలకవు. పోనీ.. కోస్తాంధ్రాలో దొరికే పులస చేప అనుకున్నా సరే.. రెండు నుంచి మూడు వేల కంటే ఎక్కువ పలకదు అది.

కానీ.. ఈ చేప చూడండి.. ఏకంగా 13 వేల రూపాయలు పలికింది. అవును.. మీరు పైన చూస్తున్న ఫోటోలో ఉన్న చేపే అది. మహారాష్ట్రలోని పూణెకు సమీపంలోని బాభుల్ గావ్ గ్రామంలో ఉన్న ఓ రిజర్వాయర్ లో ఈ చేప దొరికింది. చేపలు పట్టేవాళ్లు రోజూ లాగే చేపలు పడుతుండగా.. ఈ అరుదైన అహెర్ జాతికి చెందిన చేప దొరికింది.

అరుదైన చేప కావడంతో దాన్ని పక్కనే ఉన్న మార్కెట్ లో అమ్మకానికి పెట్టారు. దీంతో ఆ చేపను కొనడానికి జనాలు ఎగబడ్డారు. దాన్ని వేలం వేయగా… రికార్డు స్థాయిలో 13 వేలు పెట్టి ఓ వ్యక్తి దాన్ని దక్కించుకున్నాడు.

ఎహె.. ఆ చేపలో ఏముందని అంత ధర పెట్టి కొనుక్కోవాలి అంటారా? ఎందుకంటే.. ఆ చేపను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అంతే కాదు.. ఆ చేప తింటే పలు రకాల సమస్యలు కూడా పోతాయట. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేప మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు… జనాలు మాత్రం ఎంత ధరైనా పెట్టి కొనడానికి ఎగబడతారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version