బ్రెడ్ ఆమ్లెట్ ని చాలా మంది అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఎవరికి నచ్చిన స్టైల్ లో వాళ్ళు ఆమ్లెట్స్ ని తయారు చేసుకుంటూ ఉండడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం చాలా వెరైటీగా వుంది. చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ ఆమ్లెట్ ని ఫాంటా తో తయారు చేయడం జరుగుతుంది.
గుజరాత్ సూరత్ లో ఫాంటా ఆమ్లెట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోకి తెగ లైకులు వచ్చేస్తున్నాయి. ఇక ఈ వైరల్ వీడియో గురించి చూస్తే.. ఒక బ్లాగర్ సూరత్ లో వున్న ఒక షాప్ కి వెళ్ళాడు. అయితే అక్కడ ఫాంటా తో ఆమ్లెట్ ని తయారు చేస్తున్నారు. నెటిజన్లు ఈ వీడియో చూసి అవాక్ అవుతున్నారు.
Mom come pick me they're frying Fanta with eggs. pic.twitter.com/EcvoXszmTK
— Eesha (she/her) (@Agabaai) August 4, 2021
దీని ధర రెండు వందల యాభై రూపాయలు. ఈ ఫాంటా ఆమ్లెట్ ని తయారు చేసే విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. 87 వేల వ్యూస్ కంటే ఎక్కువ ఈ వీడియోకి వచ్చాయి. నిజంగా ఈ ఆమ్లెట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అయితే సూరత్ లో ఇది బాగా ఫేమస్ అని బ్లాగర్ చెబుతున్నారు.