ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పై ఫోకస్ పెట్టింది అనేది తెలిసిందే. సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం అంటూ పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వాడకం పై అవగాహన పెంచుతూ సెలబ్రెటీలు.. ప్రముఖుల చేత వీడియోలు పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పై ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కీలక కామెంట్స్ చేసారు. ఇతరుల మనసులు గాయపడటం కోసం సోషల్ మీడియా వాడకూడదు అని ఆయన అన్నారు.
అలాగే మీరు ఎవరినైనా ఏదైనా అనాలంటే.. అదే మాట మనల్ని వాళ్ళు అంటే ఎలా ఉంటుందో ఆలోచించాలి అంటూ అందులో చాగంటి తెలిపారు. ఇక సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం అంటూ పేర్కొన చాగంటి.. పది మంది శాంతి కోసం మాటను వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడటం కోసం వాడకూడదు అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు.