ఇండియ‌న్ కుర్తా ఖ‌రీదు రూ.2.50 ల‌క్ష‌ల‌ట‌.. Gucci కంపెనీని ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

-

కుర్తా పైజామా ఖ‌రీదు మ‌హా అయితే ఎంత ఉంటుంది ? త‌క్కువ ఖ‌ర్చులో అయితే రూ.500 కే రెండూ వ‌స్తాయి. లేదా రూ.1వేయి నుంచి రూ.2వేల వ‌ర‌కు ఒక రేంజ్‌లో వాటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. కానీ ఎవ‌రైనా స‌రే ఆ డ్రెస్‌ను రూ.ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేస్తారా ? లేదు క‌దా. అవును, అందుక‌నే రూ.ల‌క్ష‌ల ఖ‌రీదు గ‌ల కుర్తా పైజామాను విక్ర‌యిస్తున్నందుకు ఆ కంపెనీని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

ప్ర‌ముఖ ఇటాలియ‌న్ ఫ్యాషన్ హౌజ్ కంపెనీ Gucci ఇండియ‌న్ కుర్తా పైజామా డ్రెస్‌ను త‌న స్టోర్‌లో సేల్‌కు ఉంచింది. దాని ఖ‌రీదు ఎంతో తెలుసా ? అక్ష‌రాలా 2100 డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.1.50 ల‌క్ష‌ల‌న్న‌మాట‌. ఇక ఇందులోనే ఇంకాస్త ఖ‌రీదైన మోడ‌ల్ కావాలంటే 3500 డాల‌ర్లు చెల్లించాలి. అంటే రూ.2.50 ల‌క్ష‌ల‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలోనే Gucci కంపెనీ ఈ డ్రెస్‌ను స్టోర్‌లో సేల్‌కు ఉంచ‌గానే ఆ విష‌యం తెలుసుకున్న భార‌త నెటిజ‌న్లు Gucci కంపెనీని ట్రోల్ చేస్తున్నారు.

రూ.500 కు ల‌భించే ఆ డ్రెస్‌ను రూ.2.50 ల‌క్ష‌లు పెట్టి ఎవ‌రైనా కొనుగోలు చేస్తారా ? పిచ్చివాళ్లు అయితేనే అంత‌టి భారీ ధ‌రకు ఆ డ్రెస్‌ను విక్ర‌యిస్తారు. వీధి వ్యాపారుల వ‌ద్ద ఇదే డ్రెస్‌ను రూ.100 కే కొంటా. కావాలంటే చూడండి.. అంటూ నెటిజ‌న్లు ర‌క ర‌కాల కామెంట్లు పెడుతున్నారు.

అయితే Gucci ట్రోల్స్ బారిన ప‌డ‌డం ఇదేం కొత్త కాదు. 2019 ఆరంభంలో సిక్కులు ధ‌రించే ఓ ట‌ర్బ‌న్‌ను 790 డాల‌ర్ల‌కు (రూ.57వేల‌కు) స్టోర్‌లో విక్ర‌యానికి ఉంచింది. దీంతో ఆ వ‌ర్గానికి చెందిన వారు Gucci ని విమ‌ర్శించారు. ఆధ్యాత్మిక‌త‌తో ముడిప‌డి ఉన్న ట‌ర్బ‌న్‌ను అంత‌టి భారీ ధ‌ర‌కు ఎలా విక్ర‌యిస్తార‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా కుర్తా పైజామాతో మ‌ళ్లీ Gucci ట్రోల్స్ బారిన ప‌డుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version