షాకింగ్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట ప‌డ్డ 1000 ఏళ్ల కింద‌టి కోడిగుడ్డు.. ఇంకా అలాగే ఉంది..!

ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్న కోడిగుడ్లు అయితే కొన్ని రోజుల పాటు మాత్ర‌మే నిల్వ ఉంటాయి. కానీ త‌రువాత పాడ‌వుతాయి. అయితే ఇజ్రాయెల్‌కు చెందిన పురావ‌స్తు శాస్త్ర‌వేత్తలు మాత్రం 1000 ఏళ్ల కింద‌టి కోడిగుడ్డును త‌వ్వ‌కాల్లో గుర్తించారు. ఆ గుడ్డు ఇప్ప‌టికీ పాడ‌వ్వ‌కుండా అలాగే ఉంద‌ని తెలిపారు. అన్ని ఏళ్ల పాటు ఉన్నా ఆ గుడ్డు ఎందుకు పాడ‌వ‌లేదు ? అనే విష‌యంపై వారు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌లోని య‌వ్‌నె అనే ప్రాంతంలో అక్క‌డి యాంటీక్విటీస్ అథారిటీ అధికారులు త‌వ్వ‌కాలు జ‌రిపారు. ఈ క్ర‌మంలోనే అత్యంత పురాత‌నమైన వ్య‌ర్థ ప‌దార్థాల‌ను వేసే గుంత ఒక‌టి బ‌య‌ట ప‌డింది. అందులో మాన‌వ మ‌లంతో క‌ప్ప‌బ‌డి ఉన్న ఓ కోడిగుడ్డును గుర్తించారు. అది సుమారుగా 1000 ఏళ్ల కింద‌టిద‌ని నిర్దారించారు.

మాన‌వ మ‌లంతో క‌ప్ప‌బ‌డి ఉన్నందు వ‌ల్లే ఆ గుడ్డు ఇంకా అలాగే ఉంద‌ని సైంటిస్టులు తెలిపారు. అందుకే ఆ గుడ్డు పాడ‌వ‌లేద‌న్నారు. ఇక ఆ గుడ్డుతోపాటు మ‌నిషి ఎముక‌ల‌తో త‌యారు చేసిన బొమ్మ‌ల‌ను కూడా గుర్తించారు. అవి కూడా 1000 ఏళ్ల కింద‌టివ‌ని తేల్చారు. అయితే ఆ గుడ్డు నుంచి కొద్దిగా తెల్ల‌సొన లీకైంద‌ని, కానీ ప‌చ్చ సొన అలాగే ఉంద‌ని, ఆ గుడ్డు ఇంకా పాడ‌వ‌లేద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఆ గుడ్డు డీఎన్ఏపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేస్తామ‌ని వారు తెలిపారు.