భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్… తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇవాళ సాయంత్రమే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించారు ఆయన కుటుంబ. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. ఈ తరుణంలోనే ఆయన పరిస్థితి విషమించడంతో మరణించడం జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు… ఆయనకు…. సంతాపం తెలుపుతున్నారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని అన్నారు.