యూరప్‌లోని క్రిమియాలో ఉన్న లయన్ సఫారీ పార్క్ అది. దాన్నే టైగాన్ సఫారీ పార్క్ అని కూడా అంటారు. టూరిస్టులు అడవి రాజు సింహాన్ని దగ్గరగా చూద్దామని ఓ వెహికిల్ వేసుకొని పార్క్‌లోపల బయలుదేరారు. కెమెరాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పక్కన సేదతీరుతున్న ఓ సింహం కనిపించింది. దాని దగ్గరగా వాహనాన్ని పోనిచ్చాడు డ్రైవర్. అంతే.. వెంటనే లేచి వచ్చి వాహనంలోకి దూరింది ఆ సింహం. అయితే.. అది వాళ్లను ఏమీ అనలేదు. ఎందుకంటే.. వాళ్లతో పాటు దాని ట్రెయినర్ కూడా ఆ వాహనంలోనే ఉన్నారు. ఆయనే ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చాడు. దీంతో వాహనంలో దూరిన సింహంతో సెల్ఫీ దిగుతూ ఎంజాయ్ చేశారు టూరిస్టులు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నది. అయితే.. నెటిజన్లు మాత్రం ఆ వీడియోపై నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. అది సింహం. అటువంటి క్రూర మృగానికి దూరంగానే ఉండాలి, దాని బుద్ధి చూపిస్తే వీళ్ల పని ఏం కావాలి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎనిమిది వారాల క్రితం ఇదే పార్క్‌లో విత్య అనే సింహం ఓ మహిళపై దాడి కూడా చేసిందట. అయితే.. సింహాలను దగ్గర్నుంచి చూపించడమే ఈ పార్క్ ప్రత్యేకత. చాలామంది వాటితో సెల్ఫీలు దిగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అదీ సంగతి.
Although he looks as affectionate as my cat NO chance would I chance that ?
— gladiatorjac's????? (@gladiatorjacs) September 5, 2018
My love of animals says yes, give me a cuddle but my head says, I'm food, it wants to eat me and I wouldn't stand a chance.
— Steve (@SteveHy30160112) September 5, 2018
I don't understand all the laughing. THIS IS A LION. A REAL LION. But hey, that's just me. *shrugs* https://t.co/LzEVaq1Z4C
— Drew Walker ~ US*99 (@radiodrew) September 5, 2018