పారిస్ లో ప్రస్తుతం ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం ఈ క్రీడలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంది. ఈ తరుణంలోనే ఒలింపిక్స్ గేమ్స్ లో భాగంగా హై జంప్ లో గెలిచే అవకాశాన్ని ఫ్రెంచ్ ఆటగాడు కోల్పోయాడు. ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి ఒలింపిక్ క్రీడలు. ఈ సారి పారిస్ లో జరుగుతున్నాయి.
UNUSUAL 😳
🇫🇷French pole vaulter Anthony Ammirati misses the pole and knocks it down with his "bulge" during the Paris Olympics. #Paris2024 #Olympics pic.twitter.com/TJOUWzR3Ob
— F.M NEWS (@fmnews__) August 3, 2024
ఫ్రాన్స్ కి చెందిన ఆంథోనీ అమిరాతి అనే క్రీడాకారుడు హైజంప్ పోటీలో పాల్గొన్నాడు. అతని మర్మాంగం అడ్డంగా ఉన్న స్థంబానికి తాకడంతో అతను కింద పడిపోయాడు. దీంతో టోర్నీలో 12వ స్థానంలో నిలిచిన ఆంథోనీ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా అతను పోటీలో విజయం సాధించినా అంతా ఫేమస్ అయ్యేవాడు కాదేమో.. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే వరల్డ్ ఫేమస్ అయ్యాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది చాలా బాధకరమైన విషయం అనే చెప్పాలి.