ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్ గా మారాలి..!

-

పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. ఈ చర్చలో పలు అంశాలను ఆ శాఖ కార్యదర్శులు కోనశశిధర్, సౌరభ్ గౌర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఏపీ యువతకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో నాక్ అక్రెడిషన్ లో ఏపీ యూనివర్సిటీలు టాప్ 10లో ఉండేవి. ఇప్పుడు నాక్ అక్రిడేషనులో ఒక్కటి కూడా లేకపోవటం శోచనీయం అని చంద్రబాబు పేర్కొన్నారు.

పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. కానీ దానిపై కూడా ఎవరికీ ఫోకస్ లేకుండా పోయింది. మన విద్యార్ధులు గ్లోబల్ స్థాయిలో నైపుణ్యాల్ని సంపాదించుకునేలా శిక్షణ ఇవ్వాలి. అందుకు అనుగుణంగా ఉండే కార్యాచరణ చేపట్టండి. వర్చువల్ వర్కింగ్ కోసం ఓ విధానాన్ని రూపోందించాలి.. దీనిపై ఓ వర్క్ షాప్ చేయాలి. ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్ గా మారాలన్నదే లక్ష్యం అని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version