ఇది మీటూ కాదు.. హిమ్‌టూ.. కొత్త ఉద్యమం ప్రారంభం

-

మీటూ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలను సృష్టిస్తున్నాయి. ముందుగా హాలీవుడ్‌లో ప్రారంభమైన మీటూ ఉద్యమం ఇండియాకు కూడా పాకింది. బాలీవుడ్‌లోనూ వేధింపులకు గురయిన నటులు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. దీంతో మీటూ కాస్త భారతీయ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.

ఇక.. మీటూను పక్కన బెడితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో హిమ్‌టూ అనే మరో ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం హిమ్‌టూ అనే ఉద్యమంపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. హిమ్‌టూ పేరుతో ట్విట్టర్‌లో బోలెడు పోస్టులు వచ్చి చేరుతున్నాయి. అసలు ఏంది ఈ హిమ్‌టూ అంటారా? పదండి తెలుసుకుందాం..

ఓ తల్లి.. తన కొడుకు ఎటువంటి వ్యక్తి.. అతడి లక్షణం, అతడు సాధించిన విజయాలను ట్విట్టర్ వేదికగా హిమ్‌టూ అనే హ్యాష్‌టాగ్‌తో వెల్లడించింది. బ్లూస్టార్‌నావీమామ్ అనే ట్విట్టర్ హాండిల్‌తో తన కొడుకు వ్యక్తిత్వం గురించి ఆ తల్లి పోస్ట్ పెట్టింది. అతడి ఫోటోను కూడా జత చేసింది. ఈ వ్యక్తి నాకొడుకు. గ్రాడ్యుయేట్. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. యూఎస్‌వో అవార్డు కూడా వచ్చింది. జెంటిల్‌మెన్. మహిళలంటే విపరీతమైన గౌరవం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా. వేధింపుల గురించి బయట ఆరోపణలు ఎలా చేస్తున్నారో తెలుసు కదా. నాకొడుకు అందుకే ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలన్నా బయపడుతున్నాడు. నా కొడుకు మీద ఎవరు ఏం ఆరోపణలు చేస్తున్నారో అని భయంగా ఉంది. ఇటువంటి కొడుకులందరికీ నా ఓటు.. అంటూ ట్వీట్ చేసింది ఆ తల్లి.


ఇక.. సోషల్ మీడియా ఊరుకుంటుందా? నెటిజన్లు ఆ తల్లి ట్వీట్‌పై మెమెలు క్రియేట్ చేయడం ప్రారంభించారు. హిమ్‌టూ హ్యాష్‌టాగ్‌తో ఆ మహిళ ట్వీట్‌పై సెటైర్లు వేయడం ప్రారంభించారు. దీంతో ఆ మహిళ తన ట్విట్టర్ అకౌంట్‌నే డిలీట్ చేసేసింది. చివరకు ఆ మహిళ కొడుకు తన ఫోటోతో సహా ఓ ట్వీట్ చేసి నెటిజన్లను కూల్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version