సోఫియా రోబోతో సెల్ఫీ తీసుకొని అడ్డంగా బుక్కయిన నారా లోకేశ్!

-

నారా లోకేశ్.. ఏపీ మంత్రి. అంతేనా కాదు కాదు.. అంతకు మించి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొడుకు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు. అంతేనా.. కాదు కాదు.. అంతకుమించి.. సోషల్ మీడియా ఐకాన్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అంతేనా.. కాదు కాదు.. అంతకు మించి.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతుంటాడు. ఇదివరకు ఎన్నోసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ట్రోలింగ్‌కు గురయిన లోకేశ్ తాజాగా మరో ట్వీట్‌తో అడ్డంగా బుక్కయ్యాడు.

రోబో సోఫియా ఉంది తెలుసు కదా. దానితో సెల్ఫీ దిగాడు. ఆ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. అదే ఇప్పుడు లోకేశ్ కొంపముంచింది. రెండు రోబోలు ఒకే ఫ్రేములో ఉన్నాయంటూ ఒకరు.. దానితో ఎక్కువ సేపు స్పెండ్ చేయకండి సార్.. కనిపెట్టేస్తది మన నిక్ నేమ్ అంటూ మరొకరు.. సోఫియాతో బ్రెయిన్‌లేని వాకింగ్ టాకింగ్ అంటూ ఇంకొకరు.. ఇలా నెటిజన్లు లోకేశ్ ట్వీట్‌పై పడ్డారు. లోకేశ్‌ను ట్రోల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version