వైరల్ వీడియో; జుట్టుకి నిప్పు అంటించిన బార్బర్…!

-

కాలం మారుతున్న కొద్దీ హెయిర్ స్టైల్ లో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. జనాలు కొత్తదనం కోరుకోవడంతో పాటుగా తాము కొంచెం వింతగా కనపడాలని తపన పడుతున్నారు. దీనితో బార్బర్లు కూడా కాస్త కొత్తగా ఆలోచించి జుట్టుకి సరికొత్త అందాన్ని తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా బార్బర్ చేసిన హెయిర్ స్టైల్ చూస్తే గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి.

వివరాల్లోకి వెళితే టిక్ టాక్ లో ఒక వీడియో ని పోస్ట్ చేసారు. ఈ వీడియోలో కస్టమర్ కుర్చీలో కూర్చోగా వ్యక్తిని భుజం చుట్టూ తువ్వాలు, జుట్టుకి ఒక క్రీం రాసి మంట వెలిగిస్తాడు. ఆ మంట మండుతూ ఉండగానే తన వద్ద ఉన్న రెండు దువ్వేనలతో బ్రష్ చేస్తూ ఉంటాడు. దీనితో మంట అదుపులోకి వస్తుంది. ఇంత జరుగుతున్నా సరే కుర్చీలో కష్టమర్ అద్దంలో తన మొహాన్ని తాను చూసుకుని ఏ మాత్రం భయపడలేదు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను టిక్‌టాక్‌లో నవంబర్‌లో టిక్‌టాక్ యూజర్ ‘ప్రకాష్_జోన్ 143’ మొదటిసారి షేర్ చేసారు. ఈ వీడియని టిక్‌టాక్‌లో 30 మిలియన్ల మంది చూడగా ట్విట్టర్ లో 13 మిలియన్ల మంది చూసారు. మొత్తం 43 మిలియన్ల వీక్షణలకు చేరుకుంది. వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టంగా తెలియకపోగా, ఇది మన దేశంలో వీడియో అనే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version