ఇడ్లీ, దోశ పిండి కొంటే.. ఒక బకెట్‌ నీళ్లు ఉచితం..!

-

చెన్నైలోని బీవీ నాయికర్‌ స్ట్రీట్‌ ట్రిప్లికేన్‌ అనే కాలనీలో నివాసం ఉంటున్న సీఎన్‌ పార్థసారథి  తన షాపులో  ఇడ్లీ, దోశ పిండి ఒక కిలో కొన్న వారికి ఒక బకెట్‌ నీటిని ఉచితంగా అందిస్తున్నాడు.

చెన్నై నగరంలో ప్రస్తుతం నీటి సమస్య ఎలా ఉందో అందరికీ తెలిసిందే. జనాలు నిత్యావసరాలకు పక్కన పెడితే తాగేందుకు ఒక్క గుక్కెడు నీరు లేక అల్లాడిపోతున్నారు. ఇక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలైతే ఉద్యోగులకు తమ నీళ్లను తామే తెచ్చుకోవాలని ఆదేశించాయి. ఆ నగరంలో భూగర్భ జల వనరులు పూర్తిగా అంతరించిపోవడంతో వారికి నీటి కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. అయితే చెన్నైలోని ఓ కిరాణా షాపు యజమాని మాత్రం తమ కాలనీలో ఉండే వారికి వినూత్న ఆఫర్‌ను అందిస్తున్నాడు. అదేమిటంటే…

చెన్నైలోని బీవీ నాయికర్‌ స్ట్రీట్‌ ట్రిప్లికేన్‌ అనే కాలనీలో నివాసం ఉంటున్న సీఎన్‌ పార్థసారథి స్థానికంగా కిరాణా షాపును నడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం నీటికి కటకటగా ఉన్న నేపథ్యంలో అతను తన షాపులో ఒక వినూత్న ఆఫర్‌ను అందిస్తున్నాడు. తన షాపులో ఇడ్లీ, దోశ పిండి ఒక కిలో కొన్న వారికి ఒక బకెట్‌ నీటిని ఉచితంగా అందిస్తున్నాడు.

 

అయితే ఇందులో వ్యాపార కాంక్ష ఏమీ లేదని, కేవలం కాలనీ వాసులకు నీటిని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్‌ను పెట్టానని అతను చెబుతున్నాడు. అయితే కేవలం నీళ్లు అవసరం ఉన్నవారే తన దగ్గర పిండి కొని నీటిని తీసుకెళ్తున్నారని, తనకు వచ్చే లాభాల్లోంచి కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టి ఇలా తమ కాలనీ వాసులకు నీటిని ఉచితంగా అందిస్తున్నానని అతను చెబుతున్నాడు. అయితే ఆ నీటిని తాగడానికి వాడితే కచ్చితంగా మరగబెట్టాలని కూడా అతను తన కాలనీ వాసులకు సూచిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఆఫర్‌కు సంబంధించిన ఓ బోర్డును కూడా అతను తన షాపులో వేలాడదీశాడు. మరి చెన్నై నగర వాసుల నీటి కష్టాలు తీరేందుకు ఇంకెంత కాలం పడుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version