సాధారణంగా కిలో ఉల్లిగడ్డ ధర ఎంతుంటుంది అంటే.. 20 రూపాయలు అని చెప్పొచ్చు. అయితే.. ఒక్కోసారి ఉల్లిధరలు ఆకాశాన్ని అంటడం కూడా మనం చూశాం. 100 రూపాయలకు కిలో ఉల్లిగడ్డ అమ్మిన రోజులూ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మాత్రం ఉల్లిగడ్డ ధర పాతాళానికి తాకింది. అవును.. ఇప్పుడు కిలో ఉల్లిగడ్డ ధర ఎంతో తెలుసా? కేవలం రూపాయి. అవును.. ఒక్క రూపాయి అంతే. ఓ చాక్లెట్ విలువ. కాకపోతే ఈ ధర కర్ణాటకలోని హుబ్బళ్లిలో. అక్కడ మార్కెట్ లో ఉల్లిధర ఏకంగా రూపాయికి పడిపోయిందట. గత వారం క్వింటాకు 650 రూపాయలు పలికిందట ఉల్లిగడ్డ. కాని… ప్రస్తుతం 100 రూపాయలకు చేరుకున్నదట. 100 కిలోలకు 100 రూపాయలంటే.. కిలో ఒక్క రూపాయే కదా. ఉల్లిధరలు అమాంతం పడిపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. బ్రోకర్ల కక్కుర్తి వల్లే ఇలా ధరలు పడిపోయాయని రైతులు బోరుమంటున్నారు.