జాతీయ గీతాన్ని హేళన చేస్తూ పాడి అడ్డంగా బుక్కయిన యువతి.. వీడియో

-

ఓ యువతి ఊరు చైనా.. ఆమె ఆన్ లైన్ స్టార్. అంటే ఆన్ లైన్ లో పాటలు పాడటం చేస్తుంటుంది. ఇలాగే ఓరోజు చైనా జాతీయ గీతాన్ని పాడింది. మామూలుగా పాడితే ఇప్పుడు మనం ఆమె గురించి మాట్లాడుకునేవాళ్లమే కాదు.. జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆలపించాలి.. ఎలా ఆలపించాలి.. అనే జనం లేకుండా అడ్డదిడ్డంగా పాడేసింది. అడ్డంగా బుక్కయింది. జాతీయ గీతాన్ని హేళన చేస్తున్నట్టుగా చేతులు ఊపుతూ.. నవ్వుతూ.. వేళాకోళం చేస్తూ ఆ యువతి పాడిన పాట హుయా అనే యాప్ లో పోస్ట్ అయింది. దీంతో ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెను తీసుకెళ్లి 5 రోజుల పాటు నిర్బంధించారు. తన తప్పు తెలుసుకున్న ఆ యువతి అందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పడంతో అంతా శాంతించారు. ఆమెకు హుయా అనే యాప్ లో 4 కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version