పానీపూరి..ఆ పేరు వింటనే..పానీపూరి లవర్స్ కి నోరు ఊరిపోతుంది కదూ. రోడ్లపక్కన ఉండే పానీపూరి బండి దగ్గర పానీపూరిని ఎంత ఆస్వాదించుకుంటూ తింటారో..కొంతమంది అసలు పానీపూరి బండి కనిపిస్తేచాలు వాళ్లని వాళ్లు కంట్రోల్ చేసుకోలేరు. తినేదాక వారికి మనసులాగేస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి పానీపూరి అంటే ఇష్టం ఉంటుంది కానీ..ఆ బండీ అతను నీట్ గా ఉండడు, చేతులు క్లీన్ గా ఉంచుకోరు ఎందుకులే అనుకుని తినటం మానేస్తారు. ఇంట్లో చేసుకునే తింటారు. కానీ ఢిల్లీకి చెందిన ఓ ఇంజనీర్ చేసిన రోబోతే..అదే పానీపూరి సర్వ్ చేస్తుందట. ఇక మీకు ఈ ఓసీడీ టెన్షన్ అక్కర్లా..ఆ రోబో ఏంటో, ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం.
రోబోని ఢిల్లీలో రోబోటిక్స్ ఇంజినీర్ గోవింద్ తయారుచేశాడు. దానితోపాటూ ఓ పానీపూరీ బండిని కూడా తయారుచేశాడు. అవి రెండూ కలిసి మనుషులతో పని లేకుండా పానీ పూరీ అమ్ముతాయి. ఈ కరోనా కాలంలో ఇలాంటి క్రియేటివిటీ మనకు చాలా అవసరమే. ఈ రోజుల్లో స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీకి ఉన్నంత క్రేజ్ మరే దేనికీ లేదు. ఓసీడీ పానీపూరి లవర్స్ అదేనండి..ఇష్టం ఉన్నా..అపరిశుభ్రంగా ఉంటాయన్న డౌట్ తో తినటం మానేస్తుంటారు కదా వారిని దృష్టిలో పెట్టుకొనే ఈ యంత్రాన్ని తయారుచేశారు.
దీన్ని తయారుచేసిన గోవింద్ ఇది ఎలా పనిచేస్తోందో వీడియో తీసి యూట్యూబ్‌లోని ఫుడీ విశాల్ అనే ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఈ రోబో పనితీరును వివరించాడు. ఇది పూర్తిగా ఇండియా టెక్నాలజీతోనే తయారుచేసిన పానీపూరీ యంత్రమట. ముందుగా రోబో ఏం కావాలి అని అడుగుతుంది. పానీ పూరీయా, వడపావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలో చెబుతుంది. ఆ తర్వాత ఏది కావాలన్నా ఎల్లో కలర్ యంత్రానికి సెట్ చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసి… రూ.20 చెల్లిస్తే… పానీ పూరీని ప్యాక్ చేసిన బాక్సును ఇస్తుంది. ఆ బాక్సులో 6 పానీ పూరీలు ఉంటాయి.. అలాగే ఓ రీసైక్లింగ్ గ్లాస్ ఇస్తుంది. ఈ యంత్రానికి నాలుగు రకాల ఫ్లేవర్లతో లెమన్ వాటర్, స్వీట్ వాటర్, స్పైసీ వాటర్ ఉన్నాయట. గ్లాస్‌ని యంత్రం దగ్గర ఉంచితే… కావాల్సిన ఫ్లేవర్ డ్రింక్ మనం పొందవచ్చు. ఇలా పూర్తిగా మనుషులతో పనిలేకుండా ఈ యంత్రం పనిచేస్తుంది.
ఇదే యంత్రం వడాపావ్ కూడా ఇస్తుంది. దాని ధర రూ.21 అట. ఆ ధర చెల్లిస్తే… బాక్స్ రూపంలో వడాపావ్ బాక్స్ పొందవచ్చు. ఈ యంత్రం కావాలి అనుకునేవారు గోవింద్‌కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఈ వీడియో కింద అతని మొబైల్ నంబర్ (919311328736)కూడా ఇచ్చారు.
నవంబర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.. దాదాపు 8 లక్షల మంది దాకా చూశారు. అందరూ గోవింద క్రియోటివిటీని మెచ్చుకుంటున్నారు. ఇంత చెప్పాకా మీకు కూడా అది ఎలా పనిచేస్తుందో అని చూడాలని ఉంది కదా. ఈ లింక్ ద్వారా చూసేయండి మరీ.!