RC15 నుంచి మరో లీక్..శంకర్ మార్క్ ఇంటర్వెల్ బ్యాంగ్!

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ RC15కు లీకుల బెడద తప్పడం లేదు. వరుసగా ఈ చిత్రానికి సంబంధించిన లీకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ పిక్చర్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఈ మూవీలో రామ్ చరణ్ IAS, IPS ఆఫీసర్ గా కనిపించబోతున్నారని ఇప్పటికే లీక్ వచ్చేసింది. కాగా, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..ప్రభుత్వ విధానాలు, సిస్టమ్ పైన విసుగు చెందిన షార్ట్ టెంపర్ యువకుడిగా రామ్ చరణ్ సినిమాలో కనిపిస్తారట.

ఈ క్రమంలోనే రామ్ చరణ్..సినిమా స్టోరిలో ఊహించని టర్న్ లో భాగంగా ఓ రాష్రానికి సీఎం అవుతారట. అది ఇంటర్వెల్ బ్యాంగ్ గా శంకర్ ప్లాన్ చేసినట్లు టాక్. అలా ముఖ్యమంత్రి గెటప్ లో రామ్ చరణ్ వెండితెరపైన కనిపించగానే ఇంటర్వెల్ బ్రేక్ వచ్చేస్తుందని వార్తలొస్తున్నాయి. మొత్తంగా రామ్ చరణ్ ను ఈ సినిమాలో వెరీ డిఫరెంట్ గెటప్స్ లో చూపించేందుకు శంకర్ ఫిక్స్ అయ్యాడని సమాచారం.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇటీవల కాలంలో ఊహించిన స్థాయి విజయాలు సాధించలేదు. ఈ క్రమంలోనే RC 15 ఫిల్మ్ .. శంకర్ పాత రోజులను గుర్తు చేసేలా ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఈ చిత్రం అవినీతికి వ్యతిరేకంగా సామాజికి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండటంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ఉంటుందట.

అలా ఈ సినిమా ‘‘ఒకే ఒక్కడు’’, ‘‘భారతీయుడు’’, ‘‘అపరిచితుడు’’ సినిమాల కోవలోకి చేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈపిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version