అంతుచిక్కని రోగం అతడి ముఖాన్ని ఎంత భయంకరంగా చేసిందో చూడండి..!

-

డాక్టర్ దగ్గరికి వెళ్తే సైనసైటిస్ అన్నాడు. కానీ.. కొన్ని రోజులకే రోగం ముదిరి ముఖం ఉబ్బి.. చివరికి ఇదిగో ఇలా తయారైంది. అసలే పేదరికం. కూలి పని చేసి బతికే ఆ వ్యక్తికి లక్షలు పోసి వైద్యం చేయించుకోవడం అంటే కష్టమే.

ఈరోజుల్లో పుట్టలు పుట్టలుగా కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఏ రోగం ఎప్పుడొస్తుందో తెలియదు. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే ఏదో ఒక రోగం వస్తుంది. ఆ రోగం డాక్టర్లకు కూడా అంతుపట్టదు. ఇలాగే ఓ వ్యక్తిని అంతుచిక్కని రోగం పట్టుకుంది. అతడి ముఖాన్ని భయంకరంగా మార్చేసింది.

మీరు చూస్తున్నారు కదా ఫోటోలు. ఆయనే. అది ఏ రోగమో తెలియదు కానీ.. మనోడు అలా అయిపోయాడు. ఫిలిప్పిన్స్ కు చెందిన పిలాపికే ఈ అంతుచిక్కని వ్యాధి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు అనారోగ్యం వచ్చింది. కళ్లు మంటలు ఎక్కాయి. ముక్కు కూడా అదేపనిగా కారడం మొదలు పెట్టింది.

డాక్టర్ దగ్గరికి వెళ్తే సైనసైటిస్ అన్నాడు. కానీ.. కొన్ని రోజులకే రోగం ముదిరి ముఖం ఉబ్బి.. చివరికి ఇదిగో ఇలా తయారైంది. అసలే పేదరికం. కూలి పని చేసి బతికే ఆ వ్యక్తికి లక్షలు పోసి వైద్యం చేయించుకోవడం అంటే కష్టమే. డాక్టర్లు కూడా అతడి రోగం ఏంటో తెలియక.. అతడికి ట్రీట్ మెంట్ చేయలేదు. దీంతో అతడి తల ఉబ్బిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక.. తల పట్టుకొని కూర్చున్నాడు ఆ వ్యక్తి. బయటికి వెళ్తే అందరూ అతడిని చూసి భయపడిపోతున్నారు. దీంతో ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్లలేక.. రూపాయి సంపాదన లేక.. అంతు చిక్కని రోగంతో అవస్థలు పడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version