ఓ మహిళ తన ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాను చెక్ చేసినప్పుడు ఈ వింత ఆకారం కనిపించింది. ఆ వింత ఆకారాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఆ మహిళ.. ఈ వింత ఆకారం నా సెక్యూరిటీ కెమెరాలో చిక్కింది.
ఏలియన్స్ అంటే తెలుసా మీకు. అవి భూమి మీద ఉండవు. వేరే గ్రహానికి చెందినవి. అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు కానీ.. అవి ఇలా ఉంటాయి.. అలా ఉంటాయి అని చెప్పుకుంటాం. ఇక.. ఇది టెక్నాలజీ యుగం కదా. ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్లు, సెక్యూరిటీ కెమెరాలు. ఎక్కడికెళ్లినా మనల్ని ఎవరో ఒకరు వెంటాడుతూనే ఉంటారు. అందరం సెక్యూరిటీ నిఘాలో ఉండాల్సిందే.
ఇది వరకు చాలాసార్లు మనం దెయ్యాలు, భూతాలు సెక్యూరిటీ కెమెరాలో రికార్డవడం చూశాం. తాజాగా ఓ వింత ఆకారం సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది. అది దెయ్యమా? భూతమా? ఏలియనా? ఏంటో తెలియదు.. కానీ.. దాని వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ మహిళ తన ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాను చెక్ చేసినప్పుడు ఈ వింత ఆకారం కనిపించింది. ఆ వింత ఆకారాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఆ మహిళ.. ఈ వింత ఆకారం నా సెక్యూరిటీ కెమెరాలో చిక్కింది. ఇంకా ఎవరి సెక్యూరిటీ కెమెరాలోనైనా చిక్కిందా? అంటూ ఆమె అడిగింది.
అయితే.. నెటిజన్లు మాత్రం ఆ వీడియోపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అది ఆకారం కాదు.. ఏదీ కాదు.. ఆ వీడియోనే ఫేక్. ఫోటోషాప్ అంటూ కామెంట్లు చేయడం.. మరికొందరు.. ఎవరో పిల్లాడు.. అండర్ వేర్ వేసుకొని వెళ్తున్నాడు.. దాన్ని కూడా రాద్ధాంతం చేస్తారెందుకు అని కామెంట్లు చేశారు.
a lady posted this and said she saw this on her home camera this morning. what y’all think this is ? pic.twitter.com/L98wckn6bO
— jey bee . ? (@jadynbee_) June 7, 2019
If you look at it closely, it looks like a normal kid wearing shorts on his head in only underwear ?
— Ben (@Ben_Wandell) June 8, 2019
You can see someone in the house stick their hand out the window at couple seconds before the video ends. Looks like a puppet of some sort to me
— not beyonce (@daneeisfunny) June 8, 2019
Yeah definitely a reflection. You can see his ears and it moves away at the same speed.
— ? (@TheVandelay) June 9, 2019
— Sasha (@s1mpleO) June 9, 2019
— Barbus? (@karenbarbus) June 8, 2019