తిన్న ప్లేట్లు కడిగిన సోనియా, రాహుల్ గాంధీ.. వీడియో

-

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ ప్లేట్లు కడిగారు. తిన్న ప్లేట్లు కడిగినా వార్తేనా? అంటూ చిరాకు పడకండి. అవును వార్తే.. అటువంటి వాళ్లు బయట తినడమే అరుదు. అటువంటిది వాళ్లు తిన్న ప్లేట్ ను వాళ్లే కడగడమంటే వార్తే. బ్రహ్మాండమైన వార్త. అందుకే మీకోసం వీడియోను కూడా అందిస్తున్నాం. ఇంతకీ.. వాళ్లు ఎక్కడికి వెళ్లారు. ఎందుకు ప్లేట్లు కడిగారో చెప్పండి అంటారా? అయితే మనం మహారాష్ట్రకు వెళ్లాల్సిందే.

మహారాష్ట్రలోని వార్ధాకు తల్లీకొడుకులు వెళ్లారు. అక్కడ మహాత్మాగాంధీ సేవాశ్రమ్ అనే ఆశ్రమాన్ని వాళ్లు సందర్శించారు. వాళ్ల వెంట మన్మోహన్ సింగ్, ఇంకా కొంతమంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారులేండి.

ఇంతకీ వాళ్లు ఆ సేవాశ్రమ్ ను ఇవాళే ఎందుకు సందర్శించారో? అని మాత్రం అడగకండి. ఇవాళ మహాత్మాగాంధీ జయంతి కదా.. అందుకే వెళ్లారు. అక్కడే భోంచేశారు. అనంతరం.. వాళ్లు తిన్న ప్లేట్లను కుళాయి దగ్గరికి వెళ్లి శుభ్రం చేశారు. అది సంగతి. గాంధీజీ అంటే నిరాడంబరత కదా. ఆ నిరాడంబరత్వాన్ని చూపించడానికే వాళ్లు ఇలా ప్లేట్లు కడిగారు కాబోలు అంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంటుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version