ఈ కన్ స్ట్రక్షన్ వర్కర్ డ్యాన్స్ కి మీరు ఫిదా కావాల్సిందే.. వీడియో

-

రోజు వారి కూలీ పని చేసుకొని బతికేవాళ్లలోనూ చాలా టాలెంట్ ఉంటుంది. కానీ.. వాళ్లు బయటికి తీయరు. ఆర్థిక పరిస్థితులు కానీ.. ఇతర పరిస్థితులు కానీ.. వాళ్లలో టాలెంట్ అలాగే ఉండిపోతుంది. వాళ్ల టాలెంట్ ను బయటికి తీయడానికి సరైన వేదిక దొరికితే.. వాళ్ల లైఫే మారిపోతుంది. అలా సాధారణ వ్యక్తులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయినవాళ్లను మనం చూశాం.

డ్యాన్సింగ్ అంకుల్ కానీ… ప్రియా ప్రకాశ్ వారియర్ కానీ… సింగర్ బేబీ కానీ.. ఇలా చాలామంది తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో బయటపెట్టడంతో అది కోట్ల మందికి చేరడం.. వాళ్లు ఓవర్ నైట్ స్టార్లు అవడం క్షణాల్లో జరిగిపోతుంది.

ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అటువంటి ఓ వ్యక్తి గురించే. ఆ వీడియో ప్రకారం.. అతడు ఓ కన్ స్ట్రక్షన్ వర్కర్ లా కనిపిస్తున్నాడు. వర్కర్లంతా కాసేపు రిలాక్స్ అవుతున్న సమయంలో ఆ వ్యక్తి తన డ్యాన్స్ తో అదరగొట్టేశాడు. మామూలుగా కాదు. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో ఉర్రూతలూగించాడు. అతడు డ్యాన్స్ చేస్తుండగా తన తోటి వర్కర్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఆ వ్యక్తిని నెటిజన్లు తెగ పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version