అతడే వివేకాను హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హత్యకు రెండుమూడు రోజుల ముందు వివేకానంద ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో సంచలనం సృష్టించింది. ఆయనది సహజ మరణమని… గుండె పోటుతో ఆయన మృతి చెందారని ముందుగా భావించినప్పటికీ.. పోస్ట్ మార్టం నివేదికలో ఆయనది మర్డర్ అని తేలడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు.. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చది. ఆయన అజాత శత్రువు. ఆయన చాలా మృదు స్వభావి.. అంటూ పులివెందుల ప్రజలు చెబుతున్నారు.
అయితే… ఈ హత్య కాస్త రాజకీయ రంగు పులుపుకుంది. ఆయన హత్యపై వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు.
అయితే… వివేకానందరెడ్డిని సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సుధాకర్ రెడ్డి పాత నేరస్థుడు, రౌడీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యతోనూ సుధాకర్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలల కిందనే సుధాకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతడే వివేకాను హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హత్యకు రెండుమూడు రోజుల ముందు సుధాకర్ రెడ్డి వివేకానంద ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇవాళ ఉదయం 10.30 కు అంత్యక్రియలు
మరో వైపు వివేకానంద రెడ్డి అంత్యక్రియలు ఇవాళ ఉదయం 10.30 కు జరగనున్నాయి. తన తండ్రి వైఎస్ రాజారెడ్డి సమాధి వద్దే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు వైసీపీ నేతలు, వైఎస్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
వివేకా హత్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న జగన్
వివేకానందరెడ్డి హత్యపై జగన్.. గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయనున్నారు. వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాక… సాయంత్రం 4 గంటలకు జగన్.. నరసింహన్ ను రాజ్ భవన్ లో కలవనున్నారు. పార్టీ నేతలతో కలిసి వివేకానంద హత్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు ఈ హత్యే నిదర్శనమని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకుపోనున్నారు.