ఆ న్యూడ్ రెస్టారెంట్ ను మూసేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

-

అవును.. అది న్యూడ్ రెస్టారెంట్. అంటే ఆ రెస్టారెంట్ కు వెళ్లారంటే.. ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడదు. బట్టలన్నీ విప్పేయాలి. ఆడ అయినా.. మగ అయినా.. ఎవరైనా సరే.. అలా అయితేనే ఆ రెస్టారెంట్ లో ఫుడ్ సర్వ్ చేస్తారు. వింతగా ఉంది కదా.. విచిత్రంగా ఉంది కదా. అవును.. చాలా ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్ కానీ.. త్వరలోనే ఆ రెస్టారెంట్ మూతబడుతోంది.

ఆ రెస్టారెంట్ కు వెళ్లాలంటే పారిస్ వెళ్లాల్సిందే. ప్రపంచంలోనే ఫస్ట్ న్యూడ్ రెస్టారెంట్ గా చరిత్రకెక్కిన ఆ రెస్టారెంట్ పేరు ఓనేచురల్. కస్టమర్లు తాము విప్పేసిన డ్రెస్సులు పెట్టుకోవడానికి లాకర్ల సదుపాయం కూడా ఉంటుంది అక్కడ. ఆ రెస్టారెంట్లలో పనిచేసేవాళ్లు తప్పించి కస్టమర్లంతా డ్రెస్సులు విప్పేయాల్సిందే.

2016లో మైక్, స్టెఫానే అనే ఇద్దరు కవలల ఆలోచనకు ప్రతిరూపమే ఈ రెస్టారెంట్. తమ రెస్టారెంట్ కు వచ్చే వాళ్లు ఎటువంటి దాపరికాలు లేకుండా మనసు విప్పుకొని మరీ ఉండాలని.. అలా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే.. తమ బట్టలను కూడా విప్పేయాలని.. అలా విభిన్నంగా గడపడం కోసమే ఈ న్యూడ్ రెస్టారెంట్ ను ప్రారంభించామని వాళ్లు తెలిపారు. అయితే… వచ్చే నెల 16 నుంచి ఈ రెస్టారెంట్ ను మూసేయనున్నారు. ఇప్పుడు కస్టమర్లు అంతగా రావట్లేదట. రెస్టారెంట్ ను ప్రారంభించిన కొత్తలో ఆ రెస్టారెంట్ కు జనాలు ఎగబడే వారట. కానీ.. ఇప్పుడు జనం అంతగా ఆసక్తి చూపించడం లేదట. అందుకే… రెస్టారెంట్ ను మూసేయబోతున్నట్టు ఆ కవలలు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version